వేసవిలో బీర్ తాగుతున్నారా - ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..!!
మద్యం ఆరోగ్యానికి హానికరం. అయినా, మద్యం విక్రయాలు ఏ మాత్రం తగ్గటం లేదు. మద్యంలో అనేక రకాల బ్రాండ్లు ఉన్నాయి. యువత ఎక్కువగా బీర్ తాగుతూ వీకెండ్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బీర్లు ఎక్కువగా తాగడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బీర్లలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ అతిగా సేవిస్తే మాత్రం అనర్థాలు తప్పవని చెబుతు న్నారు. బీర్లు అతిగా తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
చాలా మంది బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నామని భావిస్తూ ఉంటారు. కానీ, బీర్ లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. బీర్ తాగడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఎముకలు బలహీనంగా తయారవుతాయి. 35 సంవత్సరాలు దాటిన తరువాత ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళలు బీర్ తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి. పురుషులు బీర్ తాగడం వల్ల వారిలో ఛాతి పెరుగుతుంది. బీర్ తాగడం వల్ల మూత్రవిసర్జన పెరుగుతుంది. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. తలతిరగడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బీర్ లో ఉండే ఆల్కహాల్ పేగులో ఉండే పొరలను చికాకుకు గురి చేస్తుంది. బీర్ ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలం పాటు బీర్ తాగడం వల్ల సిర్రోసిస్, ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ హెపటైటిస్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాలక్రమేణా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది.

పరిమితికి మించితే సమస్యలు తప్పవు
ఎక్కువగా బీర్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. కనుక బీర్ ను తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. బీర్ తాగే అలవాటును ఒక్కసారిగా మానేయలేని వారు ఈ అలవాటును క్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. బీర్ వంటి ఆల్కహాల్ కలిగిన పానీయాలను ఆరు నెలల పాటు తీసుకోకపోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంలో పెద్ద మార్పులను చూడవ చ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. బీర్ ను మానేయడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాల ను పొందవచ్చని సూచిస్తున్నారు. మద్యానికి బానిసైన వారికి నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. తొలుత మత్తులో నిద్రపోయినా తర్వాత వారికి నిద్రాభంగం జరుగుతుంది. దీని వల్ల సరైన నిద్ర ఉండదు. మరుసటి రోజు అలసట, మానసిక ఒత్తిడికి గురవుతారు. బీరులో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల త్వరగా బరువు పెరుగుతారని, తద్వారా ఊబకాయం సమస్య బారిన పడతారని చెబుతున్నారు. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరుతుందని హెచ్చరిస్తున్నారు.
-
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications