"గోంగూర ఎండు రొయ్యల కూర".. బెస్ట్ ఛాయిస్ !
తెలుగు రాష్ట్రాల్లోని వంటలలో గోంగూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. గోంగూరలో ఉన్న పులుపు రుచికి ఏ ఇతర ఆకుకూరతో పోల్చలేము. ఇది సహజమైన విటమిన్ C, ఐరన్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అందుకే, గోంగూర వంటకాలు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివిగా ఉంటాయి. గోంగూరతో చేసిన వంటకం కూడా జీర్ణక్రియకు సహకరిస్తుంది, వేడి తక్కువగా ఉండేలా చేస్తుంది. అలాగే రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. కాగా గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు ఇలాంటివి మనకు తెలిసిందే
సాధారణంగా మామూలు చికెన్, మటన్ కంటే కూడా సీఫుడ్ లతో గోంగూర కొత్తగా ఉంటుండి. ముఖ్యంగా గోంగూరతో కలిపి చేసే రొయ్యల కూర అక్కడి సంప్రదాయ వంటకాల్లో ఒకటిగా నిలుస్తుంది. గోంగూరలోని పులుపు, రొయ్యల మృదుత్వం కలిసి ఈ కూరకు అదిరిపోయే రుచిని ఇస్తాయి. అన్నంతో తింటే అసలైన గోదావరి టచ్ కనిపిస్తుంది. అందుకే "గోంగూర ఎండు రొయ్యల కూర" రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

కావలసిన పదార్థాలు..
- ఎండు రొయ్యలు - 250 గ్రాములు (శుభ్రం చేసినవి)
- గోంగూర - 2 కట్టలు
- ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
- పచ్చిమిర్చి - 3 నుంచి 4 (చీల్చినవి)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పసుపు - ½ టీస్పూన్
- కారం - 1 నుంచి 1½ టీస్పూన్లు (రుచికి అనుగుణంగా)
- ఉప్పు - అవసరానికి
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - 1 రెమ్మ
- కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
- ఆవాలు - ½ టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రెబ్బలు - 6 నుంచి 8 (నలిగినవి)
తయారీ విధానం..
పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఎండు రొయ్యలను లేతగా వేయించాలి. పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదు. వేయించిన రొయ్యలను పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో మిగతా నూనె వేసి వేడి చేయాలి. ముందుగా ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి వాసన వచ్చే వరకు పోపు పెట్టాలి.
ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.
అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి.
ఇప్పుడు ఉడికించి నూరిన గోంగూర, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
ఇందులో ముందుగా వేయించిన ఎండు రొయ్యలను వేసి మెల్లగా కలపాలి. మూత పెట్టి సన్నని మంట మీద 8-10 నిమిషాలు ఉడికించాలి.
కూర బాగా దగ్గర పడిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
వడ్డించే విధానం..
ఈ గోంగూర ఎండు రొయ్యల కూర వేడి వేడి అన్నంతో అద్భుతంగా ఉంటుంది.
రసంతో ఉండేలా ఇష్టమైతే కొద్దిగా నీరు కలిపి ఉడికించవచ్చు.
చపాతీలు లేదా జొన్న రొట్టెలతో కూడా బాగా సరిపోతుంది.
-
పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు! -
అమ్మకు భరోసా.. మూడు దశాబ్దాల ప్రస్థానంలో భారత్ విజయగాథ -
సమ్మర్ స్పెషల్.. అటుకులతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్.. -
ఈజీగా.. ఫాస్టుగా స్నాక్ చేయాలా.. "గుంట పొంగనాలు" ట్రై చేస్తారా ?? -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!











Click it and Unblock the Notifications