Google Search 2025:ఇడ్లీ టాప్..ఉగాది పచ్చడి స్థానం ఎంతంటే..?
ప్రతి ఏడాదిలాగే 2025లో కూడా భారతీయుల ఆహార అభిరుచులు ఆసక్తికరంగా మారాయి. పండగ వంటలు, ప్రాంతీయ రుచులు మరియు వైరల్ డ్రింక్స్ ఈ ఏడాది గూగుల్ ట్రెండ్స్‌లో సందడి చేశాయి.దక్షిణ భారత దేశంకు చెందిన ఇడ్లీతో పాటు ఈ జాబితాలో మన తెలుగు వంటకం ఉగాది పచ్చడికి కూడా చోటు దక్కింది.వీటితో పాటు జాబితాలోని ఇతర వంటకాలను పరిశీలిద్దాం.
1. ఇడ్లీ (Idli)
దక్షిణ భారతీయ సత్తా చాటుతూ 'ఇడ్లీ' ఈ ఏడాది నంబర్ 1 స్థానంలో నిలిచింది. బియ్యం, మినపప్పు పిండిని పులియబెట్టి ఆవిరిపై ఉడికించే ఈ వంటకం దేశవ్యాప్తంగా అత్యంత ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌గా మరోసారి నిరూపించుకుంది.

2. పోన్స్టార్ మార్టిని (Pornstar Martini)
ఈ ఏడాది ఒక విదేశీ కాక్ టెయిల్ టాప్ 10లోకి రావడం విశేషం. వోడ్కా, ప్యాషన్ ఫ్రూట్ ప్యూరీతో తయారు చేసే ఈ ఆధునిక డ్రింక్ గురించి హోమ్ పార్టీల కోసం నెటిజన్లు తెగ వెతికారు.
3. మోదక్ / ఉకడిచె మోదక్ (Modak)
వినాయక చవితి సందర్భంగా మహారాష్ట్ర సంప్రదాయ వంటకమైన 'ఉకడిచె మోదక్' (ఆవిరి మోదక్) కోసం సెర్చ్‌లు భారీగా పెరిగాయి. బియ్యం పిండిలో కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని నింపి చేసే ఈ ప్రసాదం అందరినీ ఆకట్టుకుంది.
4. టేకువా (Thekua)
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో 'ఛత్ పూజ' సందర్భంగా చేసుకునే ఈ తీపి బిస్కట్ (గోధుమ పిండి, బెల్లంతో చేసేది) ఈ ఏడాది దేశవ్యాప్త గుర్తింపు పొందింది.
5. ఉగాది పచ్చడి (Ugadi Pachadi)
తెలుగు వారి పండుగ ఉగాది సందర్భంగా చేసుకునే 'షడ్రుచుల సమ్మేళనం' ఈ జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకుంది. వేపపువ్వు, బెల్లం, మామిడికాయ వంటి ఆరు రకాల రుచుల కలయికకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
6. బీట్రూట్ కంజీ (Beetroot Kanji)
ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో నార్త్ ఇండియాకు చెందిన ఈ ప్రోబయోటిక్ డ్రింక్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. బీట్రూట్, ఆవపిండితో పులియబెట్టి తయారు చేసే ఈ పానీయం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.
7. తిరువాదిరై కాళి (Thiruvathirai Kali)
తమిళనాడు సంప్రదాయ పండుగ 'తిరువాదిరై' సందర్భంగా బియ్యం పిండి, బెల్లం, నెయ్యితో చేసే ఈ తీపి వంటకం కోసం తమిళ ప్రజలే కాకుండా ఇతరులు కూడా ఆసక్తి చూపారు.
8. యార్క్‌షైర్ పుడ్డింగ్ (Yorkshire Pudding)
బ్రిటిష్ క్లాసిక్ సైడ్ డిష్ అయిన ఇది కూడా ఈ ఏడాది భారతీయుల సెర్చ్ లిస్ట్‌లో చేరింది. గుడ్లు, పాలు, పిండితో చేసే ఈ సింపుల్ వంటకాన్ని ఎయిర్ ఫ్రైయర్ హ్యాక్స్‌తో రీక్రియేట్ చేయడానికి ప్రజలు మొగ్గు చూపారు.
9. గోంద్ కతీరా (Gond Katira)
ఇది ఒక వంటకం కాదు, కానీ ఎండల దృష్ట్యా దీని గురించి సెర్చ్‌లు విపరీతంగా పెరిగాయి. నీటిలో నానబెడితే జెల్లీలా మారే ఈ గమ్ (Tragacanth Gum) ను వేసవి పానీయాల్లో చలవ కోసం వాడతారు.
10. కొలుకట్టై (Kolukattai)
తమిళనాడులో వినాయక చవితికి చేసే ఈ ఆవిరి కుడుములు (మోదక్‌కు దగ్గరగా ఉండేవి) ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచాయి.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications