వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా? అయితే ముందు తెలుసుకోవాల్సింది ఇదే!!

యువతలో తెల్లజుట్టు సమస్య ఇప్పుడు వేధిస్తుంది. అయితే తెల్ల జుట్టు సమస్యకు మూలాలు వెతికి తదనుగుణంగా పౌష్టికాహారం ఇచ్చి జుట్టు కాపాడుకోవాలని నిపుణులు చెప్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చిన్న వయసులోనే మీ జుట్టు నెరిసిపోతుందా? తెల్ల జుట్టుతో బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందా? కొన్ని చిట్కాలను పాటిస్తే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించుకోవచ్చు.

health tips: దాల్చినచెక్క.. డయాబెటిస్, బీపీ, బరువును తగ్గించటంలో దీనికి ఉందో లెక్క!!health tips: దాల్చినచెక్క.. డయాబెటిస్, బీపీ, బరువును తగ్గించటంలో దీనికి ఉందో లెక్క!!

 యువతలో తెల్లజుట్టు సమస్య.. కారణాలివే

యువతలో తెల్లజుట్టు సమస్య.. కారణాలివే


తెల్ల జుట్టు.. ఇప్పుడు యువతకు ఇదో పెద్ద సమస్య. చిన్న వయసులోనే వారి జుట్టు అంతా నెరిసిపోవడంతో మార్కెట్లో దొరికే రకరకాల రంగులను తలకు పెడుతూ జుట్టును సర్వనాశనం చేస్తున్నారు. అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది అంటే కావలసిన పోషకాలు అందకపోతే తెల్ల జుట్టు వస్తుంది. విటమిన్ల లోపం కారణంగా జుట్టు తెల్లబడుతుంది. జుట్టు ఆరోగ్యం కోసం కావాల్సిన పోషకాలు మన శరీరంలో లేకుంటే జుట్టు ఊడిపోవటం, తెల్లబడటం జరుగుతుంది.

 తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఇది చెయ్యండి

తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఇది చెయ్యండి


శరీరంలో విటమిన్ బి, విటమిన్ బి12, బయోటిన్, విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ ఏ లోపం ఏర్పడినప్పుడు జుట్టు తెల్లబడుతుంది. మన శరీరంలోని పోషక లోపం జుట్టులో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తించకుండా యువత తెల్లబడిన జుట్టును నల్లగా మార్చడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

 జుట్టుకి పోషకాలను ఇచ్చే ఆహారం తీసుకోండి

జుట్టుకి పోషకాలను ఇచ్చే ఆహారం తీసుకోండి


యువతలో జుట్టు తెల్లబడుతున్నట్టుగా అనిపిస్తే ముందు శరీరానికి కావాల్సిన పోషకాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు. విటమిన్లతో పాటు శరీరంలో కాపర్, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం తో తెల్లజుట్టుకు చెక్ పెట్టొచ్చు . దీని కోసం మనం విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లు, డ్రై ఫ్రూట్స్ తోపాటు ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవాలి.

 వారానికి మూడు సార్లు ఈ పని చేసి రిజల్ట్ చూడండి

వారానికి మూడు సార్లు ఈ పని చేసి రిజల్ట్ చూడండి


ఒక చెంచా నల్ల నువ్వులను వారానికి మూడుసార్లు తీసుకుంటే జుట్టు తెల్లబడడం తగ్గుతుందని చెబుతున్నారు. ఇక ఉసిరికాయను తినడం వల్ల, అల్లం తురుమును తేనెలో కలుపుకుని తీసుకోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. ఎప్పుడు పెడితే అప్పుడు ఊరికే తలంటు స్నానం కెమికల్ షాంపూలతో చేయకుండా, జుట్టు సంరక్షణ చర్యలను చేపట్టాలి.

 జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ నియమాలు మర్చిపోకండి

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ నియమాలు మర్చిపోకండి

ప్రతిరోజు కొబ్బరి నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకోవడంతో పాటు, ఒత్తిడిని తగ్గించుకోవటం, క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటే జుట్టు తెల్లబడడం తగ్గుతుందని చెబుతున్నారు. మంచి పౌష్టికాహారం, ఒత్తిడి లేని జీవితం, చక్కని నిద్ర జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి జుట్టు తెల్లబడుతుందని చింతించే బదులు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను గురించి తెలుసుకొని వాటిని నియమంగా పాటిస్తే జుట్టు తెల్లబడడం ఆగిపోవడమే కాకుండా ఆరోగ్యంగా, అందంగా పెరుగుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
The problem of grey hair among the youth is bothering now. However, experts say that the roots of the grey hair problem should be looked for and the hair should be protected by proper nutrition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X