మునక్కాయ శనగపప్పు కూర ఇలా చేస్తే అద్భుతః!
మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సీజన్ కు తగ్గట్టుగా వచ్చే కూరగాయలను, ఆకుకూరలను తినడం కూడా మనకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రస్తుతం మనం ఎండాకాలంలో ఎక్కువగా వచ్చే మునక్కాయ లను రకరకాలుగా వండే విధానాల గురించి తెలుసుకుందాం. మునక్కాయ శనగపప్పు కూర ఏ విధంగా వండుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
పదార్థాలు:
మునక్కాయ ముక్కలు – మూడు కాయల ముక్కలు
శనగపప్పు – 1 కప్పు
ఉల్లిపాయ – 1 (తరిగినది)
టమాట – 1 (తరిగినది)
పచ్చిమిర్చి – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
పసుపు – ¼ టీస్పూన్
కారం – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర – తగినంత
కరివేపాకు – కొన్ని
కొత్తిమీర – అలంకరణకు

తయారీ విధానం:
ముందుగా శనగపప్పును 30 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి, స్టవ్ పైన పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె వేసి, పోపు గింజలు వేసి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసి కలిపి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి.
మునక్కాయ , శనగపప్పు కూర ఇలా
తర్వాత అందులో మునక్కాయ ముక్కలు శనగపప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మునక్కాయ ముక్కలు మరియు శనగపప్పు బాగా ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత, అందులో ఉప్పు, కారం వేసి కలిపి మళ్లీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత దానిలో కొత్తిమీర వేసి కలిపి వేడివేడిగా అందరికీ సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన శనగపప్పు మునక్కాయ కూర రెడీ అయినట్టే. ఈ కూర అన్నంలో గాని, చపాతీలో గాని తింటే చాలా బాగుంటుంది.
-
ఆంధ్రా స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి.. ఇలా చేస్తే రుచి సూపర్! -
eye health food: కంటి చూపును కాపాడే ఆహారాలు.. ఇప్పుడు ఇవి చాలా అవసరం! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications