Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సూపర్ టేస్టీ 'గోంగూర బెండకాయ ఫ్రై'.. ఈజీగా ఇలా చేసుకోండి..

గోంగూర అంటే తెలుగు ప్రజలు లొట్టలేసుకుంటూ తింటారు. గోంగూరను ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. నిల్వ పచ్చడి అయినా, రోటి పచ్చడి అయినా అద్భుతంగా ఉంటుంది. మరి గోంగూరలో బెండకాయ వేసి వేపుడు ఎప్పుడైనా చేశారా..? ఇంటిల్లిపాది ఇష్టంగా తినే 'గోంగూర బెండకాయ ఫ్రై' తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..?

'గోంగూర బెండకాయ ఫ్రై' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బెండకాయలు అరకిలో, గోంగూర ఒక కప్పు, నూనె తగినంత, పల్లీలు పావు కప్పు, జీడిపప్పు కొన్ని, ఎండుమిర్చి ఎనిమిది నుంచి పది, ఎండుకొబ్బరి ముక్కలు ఒక కప్పు, ధనియాలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం తగినంత తీసుకోవాలి.

గోంగూర బెండకాయ ఫ్రై తయారీ విధానం చూస్తే.. ముందుగా గోంగూర ఆకులను తుంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పడు బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం గోంగూర మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఎండు కొబ్బరి, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ధనియాలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.

Super Tasty Gongura Okra Fry Make It Easily at Home Like This

ఇప్పుడు ఆ మిశ్రమంలోనే గోంగూరను వేసి క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేయాలి. అందులో ఉప్పు, కారం, పసుపు వేసి మెత్తని పొడిలా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె పోసి బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. వాటిని పక్కకు తీసుకోవాలి.

ఆ తర్వాత అదే నూనెలో పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని బెండకాయ ముక్కలలో వేయాలి. అనంతరం ఆ మిశ్రమంలో గోంగూర మసాలా పొడిని కలుపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ 'గోంగూర బెండకాయ ఫ్రై' రెడీ అయినట్టే..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+