వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ఘన్‌లోనే మసూద్ అజర్, పాక్ ఆరోపణ, తిప్పికొట్టిన ఆప్ఘనిస్తాన్

|
Google Oneindia TeluguNews

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడనే చర్చ జరుగుతుంది. అతను ఆప్ఘనిస్తాన్‌లో లేడని ఆ దేశం ప్రకటించింది. ఆ మరునాడే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. అజార్ ఆప్ఘన్‌లోనే తలదాచుకున్నాడని కామెంట్ చేశారు. దీంతో అతను ఎక్కడ ఉన్నాడనే అంశం చర్చకు వచ్చింది.

అంతేకాదు అతను ఎక్కడ ఉన్నాడనే అంశానికి సంబంధించి భారత్- పాక్ మధ్య డైలాగ్ వార్ జరుగుతూనే ఉంది. ఇదే విషయాన్ని బిలావల్ భుట్టో ప్రస్తావించారు. కానీ అదీ ఇప్పుడు మూడు దేశాల మధ్య గొడవకు కారణం కాబోతుందని తెలిపారు.

 Jaish-e-Mohammed chief Masood Azhar is in Afghanistan

అజర్ ఆప్ఘన్‌లో ఉన్నారనే వార్తలను తాలిబన్ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహీద్ ఖండించారు. ఇక్కడ కాదు.. ఉగ్రవాద కార్యకలాపాలు పాకిస్థాన్ నేలపై జరుగుతాయని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మసూద్ అజార్‌ను తమకు అప్పగించాలని పాకిస్థాన్ లేఖ రాయడంతో.. తాలిబన్ ప్రతినిధి స్పందించారు.

అయితే అంతకుముందు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి రాసిన లేఖలో.. మసూద్ అజర్ గురించి ప్రస్తావించారు. తూర్పు నంగ్రహర్ వద్ద ఉండి ఉండొచ్చని పేర్కొన్నారు. ఆప్ఘన్ నేలపై ఉగ్రవాద కార్యకలాపాలకు తావులేదని మరొకరు రాశారు. మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది. దేశంలో అనేక ఉగ్ర దాడుల వెనక కచ్చితంగా అజర్ ఉంటాడు.

English summary
Jaish-e-Mohammed chief Masood Azhar is in Afghanistan, Pakistan Foreign Minister Bilawal Bhutto Zardari has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X