చంద్ర, శనిచార ఫలాలు: హేవలంబిలో దేశంలో ఆరోగ్య, వ్యాధులు ఇలా..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈ సంవత్సరం చంద్ర, శనిచార ఫలములు ఇలా ఉన్నాయి..

చంద్రచారః
జ్యేష్ఠ శుక్ల ప్రతిపత్ భృగువార ఫలం :
శ్లో| ప్రజారోగ్యం సుభిక్షం చ క్షేమం సస్యవివర్ధనమ్ !
సువృష్టి స్పర్వదేశేషు జ్యైష్యాది ర్భ్రుగువాసరే !
అందరకు మంచి ఆరోగ్యము, సుభిక్షము, క్షేమము కలుగును. మంచిపంటలు పండును. మంచి వర్షములు కురియను.

ఆషాఢ శుక్ల పంచమీ యుక్త సౌమ్యవారఫలం :-

ఆషాఢసిత పంచమ్యాం సౌమ్యవారో యదా భవేత్|
సుభిక్షం దేహమారోగ్యం జాయతే వృద్ధి రుత్తమమ్ |
అంతటా సుభిక్షము, ఆరోగ్యము వృద్ధిచెందును.

ఆషాఢ శుక్లపక్షే స్వాతీ నక్షత్రయుక్త తిథిఫలం :-
ఆషాఢ శుక్ల పక్షేతు దశమీ యది సంయుతా | స్వాతీయుక్షేన చంద్రేణ మహావర్షం భవేద్రువమ్ II వర్షములు బాగుగా కురియును.

Astrologer described about Chandra, Shanichara Phal.

ఆషాఢ కృష్ణపక్షే రోహిణీ నక్షత్రయుక్త తిథిఫలం:-

ఆషాడే కృష్ణ పక్షే తు రోహిణీ ద్వాదశీ యుతా ! మేదిన్యాం సర్వకాలేషు సర్వసస్య వినాశనమ్ | అన్ని కాలములలోను పాడిపంటలు బాగా దెబ్బతినును.

చంద్రార్థః :- చైత్ర, వైశాఖ, ఆశ్వయుజ, పుష్య, మాఘ, ఫాల్లన మాసము లందు సమార్ధము. ఆషాఢ, భాద్రపద మాసములందు అత్యర్ధము. జ్యేష్ట శ్రావణ, కార్తిక, మార్గశిర మాసములందు శూన్యార్ధము.

శనిచార ఫలం
వత్సరాది నుండి జూన్ 20 వరకు "
ధనూరాశి స్థితే మందే భూపానా మాహవప్రదః |
జనానాం వ్యాధిపీడా చ క్షత్పీడా శస్త్రబాధతః" రాజులకు యుద్ధములు పెరుగును. అంతటా వ్యాధులు, శస్త్రచికిత్సలు, ఆకలి బాధలు పెరుగును.

తదాది అక్టోబరు 26 వరకు "
భూమీశ్యా క్రోధపూర్గా విషధర ముదితాళి పక్షిణా సన్నిపాతః సప్తద్వీపా ప్రకల్పాన్నరపతి మరణం యాంతి మేఘా వినాశమ్ |
వైకల్యా ద్వ్యాప్యమానః సకల జన రిపుః సర్వకార్యం నిమంతి సర్వే తే యాంతి నాశం సకల గుణవిధే వ్రుశ్చి సూర్యపుత్రే ."

అధికారులకు, నాయకులకు అసహనములు, కోపములు పెరుగును. పక్షులకు, సర్పములకు మంచి వృద్ధి పాలకులకు, మేఘములకు నాశనము. పరాయివాళ్ళ ఆధిక్యత ఎక్కువ అవుతుంది. అలాగే అయిన వారి వలన అన్ని విధముల ఇబ్బందులు కూడా పెరుగుతాయి.

తదాది వత్సరపర్యనం "మందే స్థితే ధన్విని వృష్టిహానిః స్యాద్భూపతీనాం కలహో నచార్జ |
పాంచాల కాశీ కురు కోసలాశ్చ నష్ణాశ్చ కాశ్మీర కలింగ వంగా" వర్షములు తక్కువగా కురియను. రాజులకు కలహములు ఎక్కువగును. ధరలు తగ్గిపోవును. పాంచాల, కాశీ, కురు, కోసల, కాశ్మీర, కలింగ, వంగ ప్రాంతములకు ఎక్కువ నష్టము కలుగును.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about Chandra, Shanichara Phal.
Please Wait while comments are loading...