ఆంజనేయ స్వామి మహాత్యం: హుంకార మంత్రం మహిమ
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం. హుంకార మంత్ర మహిమ.
పూర్వం దేవ,దానవులకు భీకర యుద్ధం జరిగింది.ఇరు పక్షాలలో చాలా మంది మరణించారు.ఇంద్రాది దేవతలంతా భయపడి దాక్కొని అనేక చోట్ల తిరుగుతూ బ్రహ్మను వెంట పెట్టు కోని మహా విష్ణువు దగ్గరకు చేరి తమ బాధను వినిపించు కొన్నారు .అందరిని తీసుకొని శ్రీ హరి కైలాసం వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వర సందర్శనం చేసి ఇలా స్తుతించారు .
"నమస్తే రుద్ర మన్యవుతోతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః -యాత్ర్హ ఇషుశ్శివ తమా శివం బభువతే -శివా శరణ్యయా తవ తయానో రుద్ర మ్రుడయా -యాతే రుద్ర శివా తనూ రాఘోరా పాప కాశినీ -నమస్తే అస్తు భగవాన్ ,విశ్వేశ్వ రాయ ,మహాదేవాయ త్ర్యంబకాయ ,త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ ,కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీ మన్మహా దేవాయ నమః - తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ -తన్నో రుద్ర: ప్రచోదయాత్"

శంకరుడు పరమానందం పొంది వచ్చిన కారణం అడిగాడు శ్రీ పతి నారాయణుడు... శుభంకరా ! శంకరా ! లోకంలో దరిద్రం తాండవిస్తోంది.కరువు ,కాటకాలతో జనం అల్లాడి పోతున్నారు .మీరిచ్చిన వరాల వలన రాక్షసులు విజ్రుమ్భించి అందరినీ బాధిస్తున్నారు.యజ్ఞ యాగాదులను సాగనివ్వడం లేదు.స్త్రీలకు రక్షణ లేదు .మానవ భక్షణ ,దేవాలయ ధ్వంసంతో వారి అరాచకాలు శృతి మించుతున్నాయి .దేవలోకాన్ని ఆక్రమించి దేవేంద్రునితో సహా అందరిని తరిమేస్తే వారంతా అనుక్షణం భయంతో బతుకు తున్నారు .
ఆ రాక్షసలు బారి నుండి మమ్మల్ని అందరిని మీరే రక్షించాలి స్వామి ఆని ప్రార్ధించారు.నా వరాల వల్ల రాక్షసులు ఇంతకు తెగిన్చారా ? నేను వారిని చంపలేను్,కాని నే నే హనుమంతునిగా జన్మించి దానవుల పాలిటి యమునిగా మారుతాను. సంహరించుట మీకు తెలుసు కధ మీ శత్రువులు హనుమంతున్ని దూషిస్తారు.ఆ దూషణం వలన వారు తేజో విహీనం అవుతారు .ఆ సమయం లో వానరా కారుడనైన నేను "హుంకారం "చేస్తాను.అదే సమయంగా భావించి మీ రందరూ మీ ఆయుధాలతో వారిని ఎదుర్కోండి.రాక్షసులంతా నశిస్తారు.మీ ఆధిపత్యాలు మీకు తిరిగి లభిస్తాయి .అని చెప్పి ఊరట కల్గించి వారిని పంపించేసాడు.
దేవగణం అంతా భక్తితో స్తుతించారు.హనుమంతుడు వారి భక్తికి సంతోషపడి,విషయం తెలుసుకుని రాక్షస సంహారానికి అందరితో కలిసి బయల్దేరాడు.
దానవులు,దేవతలను బాధిస్తూ హనుమను దూషిస్తూ ఆయుధాలతో హింసించడం మొదలుపెట్టారు.అది చూసిన మారుతికి కోపం విజ్రుమ్భించింది.భూమి,ఆకాశం దద్దరిల్లెటట్లు హుంకారం చేశాడు.దానితో రాక్షస గణం బలం తగ్గి నిర్వీర్యులవుతారు.అప్పుడు హనుమ మూడు శిరస్సులు,ఆరు నేత్రాలు ,వజ్రాల వంటి కోరలు ,భయంకరమై కత్తుల వంటి రోమాలు ఉన్న అతి భయంకార ఆకారంతో కనిపించాడు .
రాక్షసులకు భయం కలిగి కంపించి కొందరు ,నేత్రాగ్ని జ్వాలలకు ఆహుతై మరికొందరు చనిపోయారు .కొందరు నెల మీద పడి తన్నుకొని చచ్చారు .కొంతమంది దేవతల శాస్త్రా అస్త్రాలకు బలి అయ్యరు .ఈ విధం గా సర్వ రాక్షస సంహారం జరిగింది .లోక కంటకులు నశించటంతో అందరు హాయిగా ఊపిరి పీల్చు కొన్నారు.హనుమను ప్రస్తుతించారు .అందరికి ఆనందం కల్గింది .అప్పుడు ఆంజనేయుడు దేవతలారా ! మీరు నన్ను ఎప్పుడు ఆశ్రయించిన,శరణు అడిగినా నేను మీకు సర్వ శుభాలను భలాన్ని శక్తిని అందిస్తాను అని చెప్పి అంతర్ధానమయాడు .ఇదీ హుంకార మంత్ర మహిమ.
జై శ్రీమన్నారాయణ