astrology: శనివారం నాడు ఈ తప్పులు చేస్తున్నారా.. దరిద్రం పట్టి పీడిస్తుంది జాగ్రత్త!!
శనివారం శని దేవుడి వారంగా పరిగణించబడుతుంది. శనివారానికి అధిపతి శని దేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనులలో జాగ్రత్తలు వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సహజంగా శని పేరు వింటేనే అందరూ భయపడుతూ ఉంటారు. ఎవరైనా దరిద్రంతో ఇబ్బందులు పడుతూ ఉంటే, వీడికి పట్టిన శని వదలడం లేదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే శని అంతటి ప్రభావవంతమైన గ్రహంగా చెబుతారు. అయితే శని మనుషులను వారి కర్మలను బట్టి అనుగ్రహిస్తాడు. అంతే కాదు శని సహనాన్ని ఇచ్చే దేవుడు అని కూడా చెబుతుంటారు.

శనివారం శనికి అంకితమైన రోజు.. శనివారం చెయ్యకూడని పనులెన్నో
శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసే వారికి చెడుగా, మంచి చేసే వారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు. శనివారం శనికి అంకితమైన రోజు కాబట్టి ఈ రోజు కొన్ని నియమాలను పాటిస్తే శని ఆగ్రహానికి గురికాకుండా ఉంటామని సూచిస్తున్నారు. శనివారం నాడు ఈ నియమాలు పాటించకపోతే జాతకంలో శని ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక శనివారం నాడు చేయకూడని పనుల వివరాల్లోకి వెళితే

శనివారం ఇంటికి తీసుకురాకూడని వస్తువులివే
శనివారం నాడు శని దేవునికి ఇష్టమైన నువ్వుల నూనెను ఇంటికి తీసుకు రాకూడదు. శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని చెబుతున్నారు. శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అంతే కాదు ఒకరి చేతిలో నుంచి నూనె ఇంకొకరి చేతిలోకి ఇవ్వడం కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనివారం మీ ఇంట్లో ఉప్పు, నూనె, నువ్వులు కొంటె అష్ట కష్టాలు పడతారు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

శనివారం వీటిని కొని ఇంటికి తెస్తే శని ఆగ్రహానికి గురి కాక తప్పదు
శనివారం నాడు పత్తి, అగ్గి పెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు. శనివారం నాడు మంచి గుమ్మడి కాయ కూడా కొనకూడదని చెబుతున్నారు. ఇక ఈ వస్తువుల్లో ఏవైనా తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని సూచిస్తున్నారు. శని దేవుడు ఇనుమును ఆయుధంగా ధరించిన కారణంగా శనివారం ఇంట్లో ఇనుముతో చేసిన వస్తువులను తీసుకు రాకూడదు. శనివారం నాడు శని దేవుడికి ఇష్టమైన నల్లటి మినపప్పును తీసుకు రాకూడదు.

శనివారం వారిని అవమానించకూడదు, చెప్పులు కొనకూడదు
శనివారం నాడు తల్లిదండ్రులు, వృద్ధులను, నిరుపేదలను అవమానించ కూడదు. అలా అవమానిస్తే శని దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. శని న్యాయానికి ప్రతీకగా నిలిచే దేవుడు కాబట్టి శనివారం రోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే సంతోషిస్తాడు. శనివారాలలో ఏ జంతువులను హింసించ కూడదు. అంతేకాదు శనివారాలలో ఎవరికీ బూట్లు ఇవ్వకూడదు. వారి బూట్లు తీసుకోకూడదు. శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది.

శనివారం ఇవి చేస్తే ప్రతికూల ఫలితాల నుండి కాస్త ఉపశమనం
ఇంకా శనివారం మంచి ఫలితాల కోసం మినప్పప్పుతో తయారుచేసిన కిచిడీ ఎవరికైనా దానం చేస్తే మంచిది. శనివారాల్లో రావి చెట్టు కింద దీపం వెలిగించి నాణెం సమర్పించాలి. ఇక శనివారాల్లో సూర్యాస్తమయం తర్వాత మాత్రమే శని దేవుడికి దీపాలు వెలిగించాలి. సూర్యాస్తమయానికి ముందు శనిదేవుని పూజించకూడదు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
today rashiphalalu: వక్రగతిలో బుధుడు, మీనంలో సూర్య, శుక్రులు.. వీరికి ఊహించని ఫలితాలు! -
మహాలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులకు మహర్దశ -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
స్థలం ఖాళీగా ఉందని వాడుతున్నారా? వాస్తు నియమాలున్నాయి -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications