వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవరాత్రుల ప్రత్యేకం : సిద్ధిదాత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

సిద్ధగంధర్వయక్షాద్యై, అసురైరమరైరపి సేవ్యమానా
సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ

దుర్గామాతయొక్క తొమ్మిదవ శక్తి స్వరూపనామము సిద్ధిదాత్రి ఈమె సర్వవిధ సిద్ధులను ప్రసాదించును. మార్కండేయ పురాణమున ఆణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అని సిద్ధులు అష్టవిధములుగా పేర్కొనబడినవి. బ్రహ్మవైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మఖండమునందు సిద్ధులు అష్టాదశ విధములుగా తెలుపబడినవి. వాటిపేర్లు.

1) అణిమ 2)లఘిమ, 3) ప్రాప్తి 4) ప్రాకామ్యము 5) మహిమ 6) ఈశిత్వము, వశిత్వము 7)సర్వకామానసాయిత 8) సర్వజ్ఞత్వము 9) దూరశ్రవణము 10) పరకాయ ప్రవేశము 11) వాక్సిద్ధి 12)కల్పవృక్షత్వము 13) సృష్టి 14) సంహారకరణ సామర్థ్యము 15) అమరత్వము 16) సర్వన్యాయకత్వము 17) భావన 18) సిద్ధి

సిద్ధిదాత్రిమాత భక్తులకును, సాధకులకును ఈ సిద్ధులను అన్నింటిని ప్రసాదించును. పరమేశ్వరుడు ఈ సర్వసిద్ధులను దేవి కృపవలననే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడినది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధభాగమై నిలిచెను. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కెను. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన, ఈమె కమలముపై ఆసీనురాలై యుండును.

Devi Navaratrulu Special: Sidhi Dhatri

ఈమె కుడివైపున ఒక చేతిలో చక్రమును మఱొక చేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నవరాత్రి మహోత్సవములలో తొమ్మిదవరోజున ఉపాస్యదేవత ఈమెయే. ఈ దినమున శాస్త్రీయ విధి విధానములతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకల సిద్ధులును కరతలామలకములు. సృష్టియందు ఈమెకు అగమ్యమైనది ఏదియును లేదు. ఈమె కృపచే ఉపాసకునకు ఈ బ్రహ్మాండమునే జయించు సామర్థ్యము లభించును.

సిద్ధిదాత్రికృపకు పాత్రులగుటకు నిరంతరము కృషిచేయుట ఎల్లరకును ముఖ్యకర్తవ్యము. ఆమెను ఆరాధించుటలో ప్రతివ్యక్తియు ముందుండవలెను. ఆమె దయాప్రభావమున అతడు అనంతమైన దుఖరూప సంసారమునుండి నిర్లిప్తుడగును. సర్వసుఖములను అనుభవించుటయేగాక మోక్షమును సైతము పొందును.

నవదుర్గలలో సిద్ధిదాత్రి అవతారము చివరిది. మొదటి ఎనిమిది దినములలో క్రమముగా దుర్గాదేవియొక్క ఎనిమిది అవతారములను విధ్యుక్తముగ నిష్ఠతో ఆరాధించుచు తొమ్మిదవరోజున ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్ముడు కావలెను.

English summary
Astrologer says the Durga matha's ninth incarnation is Sidhi Dhatri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X