వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా కలిసిరావడంలేదా?
ఇంటి నిర్మాణం అనేది కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కూడిన కట్టడం అని ఎప్పుడూ అనుకోవద్దు. అలా భావించొద్దు. అది ఒక వ్యక్తి జీవితకాల స్వప్నం. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం అన్ని కొలతలు సరిగ్గా ఉన్నా, కొందరికి ఆ ఇల్లు స్వర్గంలా ఉంటే, మరికొందరికి ఎందుకు అశాంతిని మిగులుస్తుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే.. వాస్తును జాతకంతో సమన్వయం చేయడం తెలియకే.
వాస్తు ప్రకారం అన్ని దిక్కులూ సమానమే
కానీ వ్యక్తిగత జాతక రీత్యా అవి చూపే ప్రభావం మారుతుంటుంది
తూర్పు, ఉత్తరం దిక్కులను సాధారణంగా శుభప్రదమైన దిక్కులుగా భావిస్తారు.
అయితే, జాతకంలో సూర్యుడు, బుధుడు గ్రహాల స్థితి సరిగ్గా లేనప్పుడు,
ఈ దిక్కున వాస్తు సరిగ్గా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు.

దక్షిణం, పడమర దిక్కులంటే చాలా మంది భయపడతారు.
కానీ, జాతకంలో కుజుడు లేదా శని బలంగా ఉన్న వ్యక్తులకు ఇవి కలిసివస్తాయి.
దక్షిణ, పడమర ముఖ ద్వారాలు ఉన్న ఇళ్లలో అత్యున్నత అధికార పదవులను, అపారమైన సంపదను పొందుతారు.
దిక్కు కంటే ఆ వ్యక్తి 'లగ్న బలం' ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
వాస్తులో వీధిపోటు అంటేనే ఒక రకమైన ఆందోళన నెలకొంటుంది.
కానీ, వాస్తవానికి 'పడమర-నైరుతి' వీధిపోటు మినహా,
మిగిలిన అనేక వీధిపోట్లు సరైన జాతక బలం ఉన్నవారికి రాజయోగాలను కల్పిస్తాయి.
జాతకంలోని గ్రహగతులు అనుకూలించినప్పుడు,
వాస్తులోని చిన్న చిన్న లోపాలు ఉన్నా యజమానికి పెద్దగా నష్టం చేయవు.
సాధారణంగా ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడని చెబుతుంటారు.
అయితే, శాస్త్ర విశ్లేషణ ప్రకారం దిక్పాలకుడైన 'ఈశాన్యుడు' వేరు,
సర్వవ్యాపి అయిన 'పరమేశ్వరుడు' వేరు.
అనంతమైన విశ్వానికి అధిపతి అయిన మహాదేవుడిని
కేవలం ఒక మూలకు పరిమితం చేయడం సరైనది కాదు.
ఈశాన్యం అనేది కేవలం ఒక దిశ మాత్రమే కాదు,
అది ఇంట్లోకి సాత్విక శక్తి ప్రవేశించే మార్గం.
ఇల్లు అనేది ఒక శరీరం అయితే, జాతకం అనేది ప్రాణం వంటిది.
జాతకం బాగుండి వాస్తు బాగోలేకపోతే.. జీవితంలో ఎదుగుదల ఉన్నా మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
వాస్తు బాగుండి జాతకం బాగోలేకపోతే.. అన్ని సౌకర్యాలు ఉన్నా వాటిని అనుభవించే యోగం ఉండదు.
అందుకే, గృహ నిర్మాణం చేసేటప్పుడు కేవలం వాస్తు పండితుడినే కాకుండా,
జాతక రీత్యా ఆ దిక్కు మీకు సరిపోతుందో లేదో చెప్పగల సిద్ధాంతిని సంప్రదించడం అత్యంత ఆవశ్యకం.
మీకు నడుస్తున్న దశ, అంతర్దశ, మీ లగ్నానికి అనుగుణంగా వాస్తును మలుచుకున్నప్పుడే
ఆ ఇల్లు మీకు సుఖ సంతోషాలను ఇస్తుంది.
కేవలం దిశను చూసి ఇల్లు కొనడం కంటే,
మీ జాతకానికి ఆ దిశకు ఉన్న 'పొంతన'ను చూసుకోవడమే అసలైన విజ్ఞత.
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..












Click it and Unblock the Notifications