వాస్తు పురుషుడి గురించి తెలుసా? ఆయన్ను పూజిస్తేనే ఇంట్లోకి సంపద
వాస్తు శాస్త్రం గురించి తెలియకుండా ఎవరూ ఉండరు. ఎందుకంటే ప్రతి నిర్మాణం వాస్తును ఆధారంగా చేసుకునే జరుగుతుంది. ఈ నిర్మాణాల్లోకి సానుకూల శక్తి ప్రవేశించి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే వాస్తు పురుషుడిని పూజించాలి. ఇది చాలా ప్రధానమైన విషయం. వాస్తు పురుషుడు అంటే.. భూమి శక్తి, సమతుల్యతను సూచించే దేవతా స్వరూపం. ఏదైనా ఒక నిర్మాణం జరిగితే ఆ నిర్మాణానికి ఆత్మ లేదంటే దైవిక శక్తే వాస్తు పురుషుడు. మనం కట్టడం కట్టిన స్థలంలో ఈ పురుషుడి ముఖం నేలపైకి ఉంటుంది. ఈశాన్యంలో తల బోర్లా పడుకొని ఉంటుంది. కాళ్లు నైరుతి దిశలో ఉంటాయి.
వాస్తు పురుష మండలం అంటారు
మనం ఒక భవనాన్ని కట్టేటప్పుడు వాస్తు పురుషుడి తల, కాళ్లు, చేతులు ఏ దిశలో ఉన్నాయో చూసుకొని ఆ ప్రకారం గదులను విభజించి కట్టుకుంటాం.వాస్తు శాస్త్రం ప్రకారం భూమిపై నిర్మాణం చేసే ముందు ఆ భూమిపై ఒక శక్తి పురుషుడు పడిఉంటాడు అని భావిస్తారు. స్థలంలో వాస్తు పురుషుడు అండే స్థలాన్ని వాస్తు పురుష మండలం అని పిలుస్తారు. ఈశాన్యంలో పూజ గది ఉంటుంది. అది ఆధ్యాత్మికతకు నిలయం. అలాగే ఆగ్నేయంలో అగ్ని ఉంటుంది. మాస్టర్ బెడ్ రూం నైరుతి దిశలో ఉండాలి. పడక గది, అతిథి గది, పడక గది వాయువ్య దిశలో ఉండాలి.

వాస్తు పురుషుడిని పూజిస్తేనే సంపద
ఇల్లు నిర్మించే సమయంలో ఎవరైతే వాస్తు పురుషుడిని పూజించి, వాస్తు నియమాలు పాటిస్తారో వారికి నువ్వు సంపదను, శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తావు అని వాస్తు పురుషుడికి బ్రహ్మదేవుడు వరమిస్తాడు. ఎవరైతే వాస్తు పురుషుడిని పూజించి, వాస్తు నియమాలు పాటిస్తారో ఆ ఇంటిలో సంపద నిలుస్తుంది. మానసికంగా, శారీరకంగా మంచి ఆరోగ్యం కలుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. స్థిరత్వం వస్తుంది. శ్రేయస్సు లభిస్తుంది. స్థలంలో ఉన్న శక్తిని గౌరవించి, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి వాస్తు పురుషుడిని ప్రతి ఒక్కరూ తమకు మార్గదర్శిగా భావించాలి. ఇలా భావిస్తే అంతా శ్రేయోదాయకమే.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications