• search

మృగశిర కార్తె అంటే? ఖగోళ, పురాణ ఆధారాలు ఏమిటి?

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
  జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
  ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం, ఎం.ఏ యోగా ,యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం),
  పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
  సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

  మృగశిరకర్తె తేదీ 8 జూన్ 2018 నుండి ప్రారంభమవుతుంది. .అసలు ఈ కార్తెలు ఎలా ఏర్పడతాయి చూద్దాం. సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేశిస్తాడో ఆ నక్షత్రం ఆధారంగా నక్షత్రం యొక్క పేరుతో కార్తె పేరును పిలువబడుతుంది. అశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న ఇరువది ఏడు నక్షత్రాలలో సూర్యభగవానుడు ప్రవేశం ఆధారంగా కార్తెను నిర్ణయించడం జరుగుతుంది.

  భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తెలో దానికి సంబంధించి ప్రకృతిలోని మార్పు, దానివలన జరిగే ప్రత్యేకాంశలను సవివరంగా వివరించింది. ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, జానపదులు ( గ్రామీన ప్రాంతం వారు) ఎక్కువగా వీటిపై ఆధారపడి చేయువృత్తులు, వ్యవసాయం సాగు ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం, సాగు చేసుకుంటారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి మృగశిరకార్తె ఏర్పడుతుంది. ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని మనవారి భావన. ఇదే సమయంలో మన ప్రాంతంలోకి నైఋతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి.

  అలా నిర్ణయిస్తారు

  అలా నిర్ణయిస్తారు

  పంచాగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.

   ఇతడు చనిపోతూ

  ఇతడు చనిపోతూ


  పురాణగాధ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను, పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర హలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.

  ప్రకృతి మార్పు ప్రభావం

  ప్రకృతి మార్పు ప్రభావం

  ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు, వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా, వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ.

  ప్రస్తుతం ఈ కార్తె ప్రవేశానికి ముందు తీవ్రమైన ఎండలతో భూమి అంతా వేడేక్కి మానవ శరీరాలు తాపంతో ఉంటాయి. జూన్ మొదటి వారంలో అంటే సుమారుగా 8 తేదీ నుండి ప్రకృతి పరంగా వర్షాలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలో తీవ్రమైన ఎండల నుండి వర్షాల వలన వాతావరణం చల్లబడడంతో మానవుల శరీరంలో కూడా ప్రకృతి మార్పు ప్రభావం పడుతుంది.

  శరీరం ప్రకృతి యొక్క మార్పును తట్టుకోవడానికి ఈ రోజు ఇంగువబెల్లం తింటారు.మాంసాహారం తీసుకునే వారు చేపలను తింటారు.శాఖాహరులు మాత్రం ఇంగువను బెల్లంలో కలిపి గుండ్రని గోళిలాగ చేసి దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకుని కుటుంబ సభ్యులందరు అన్ని వయస్సులవారు తప్పక తింటారు.ఈ అయుర్వేద ప్రక్రియ వలన శరీరం బలంగా ఉంచుతూ, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుంది.

  మన పెద్దలు అన్ని రకాల ప్రయోగ అనుభవంతో

  మన పెద్దలు అన్ని రకాల ప్రయోగ అనుభవంతో


  మన పెద్దలు, పూర్వీకులు ప్రతీ విషయాన్ని వారి జీవిత అనుభంలో అన్ని రకాల ప్రయోగ అనుభవసార ఫలితంగా పరిశీలించి వారి తర్వత తరం వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే భావనచే మనకు తరుణోపాయాలు,చిట్కాలు సూచనలు చేసారు. వాటిని ఆచరించించిన వారు ఆరోగ్య ఆనందంతో గడుపుతారు. పెద్దలమాట సద్ధన్నం మూట అని ఊరికే అనలేదు.

  ఈ సంవత్సరం పంచాగ ప్రకారం ఈ కార్తె ఫలితాలు:- అల్పవృష్టి ప్రభావం కనబడుతుంది. అంటే పగలంతా ఎండలు రాత్రి సమయాలలో వర్షాలు పడతాయి. పగలు వర్షాలు సామాన్యంగా గోచరిస్తున్నాయి.

  సూచనలు- ఇంకుడుగుంత

  సూచనలు- ఇంకుడుగుంత


  సూచనలు:- ఈ కాలంలో పడే వర్షపు నీటిని వృధా పోనివ్వకుండా సద్వినియోగ పరుచుకునే మార్గాలను అన్వేశించాలి. ఇంకుడు గుంతల నిర్మాణం వలన మనకు భవిష్యత్తులో అవి భూమిలో నీటి నిల్వలను పెంచి చెరువులు, భావులు, బోర్లు ఎండి పోకుండా ఉపయోగపడతాయి. అలాగే భూవసతి ఉన్న వాల్లు ఎక్కువ మోతాదులో చెట్లను నాటాలి. తనకు స్థలంలేని వాళ్ళు మనం నివసించే పరిసర ప్రాంతాలలో, మన ఊరి రోడ్డునకు ఇరువైపుల శక్తి వంచన లేకుండా చెట్లను నాటితే అవి మనకు మేలు చేస్తాయి. భవిష్యత్తులో అవే కాపాడుతాయి. మంచి పనికి కుల, మత, ప్రాంత, లింగ, వయోభేదం లేకుండా సంకల్పించాలి. నాకెందుకులే అనే భావన మాత్రం పొరబాటున కూడా మనస్సునకు రానివ్వవద్దు. మీరు నేడు చేసిన ప్రకృతి సేవే రేపటి కాలం( తరం)లో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. జైశ్రీమన్నారాయణ.

  English summary
  Fish Prasadam day: What is Mrigasira Karthi?.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more