ఈనెల 7వ తేదీ నుంచే ఈ రాశులకు కలిసివస్తోంది... ఒకసారి చూసుకోండి..!!
గ్రహాలకు రాశి సంచారం చేయడానికి నిర్దిష సమయం ఉంటుంది. ఆ సమయంలో రాశి సంచారం చేస్తుంటే కొన్ని రాశిచక్ర గుర్తులకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలుంటాయి. అవి వారివారి కర్మలను ఆధారంగా చేసుకొని జరుగుతుంటాయి. అలాగే ఈనెల 7వ తేదీన ఒకరోజే నాలుగు యోగాలు ఏర్పడ్డాయి. సూర్యుడు, చంద్రుడు మిథునరాశిలోకి రావడంతో గజకేసరి రాజయోగం, వాసుమన్ యోగం, కుజుడు ధనుస్సు రాశిలోకి రావడంతో లక్ష్మీయోగం, సూర్యుడి వల్ల చతుర్గ్రాహి యోగాలు ఏర్పడ్డాయి. ఈ నాలుగు యోగాల ప్రభావంతో నాలుగు రాశులకు అమితమైన ఆర్థిక లాభాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
కన్యారాశి
కొన్ని కొన్ని పనుల్లో ఈ రాశివారు రాణించినంతగా మరెవరూ రాణించలేరు. విద్యకు సంబంధించిన విషయాల్లో, వ్యాపారాల్లో మంచి అవకాశాలతోపాటు లాభాలను పొందే అవకాశం ఉంది. ప్రధానంగా బంధువులు, స్నేహితులు సహకరిస్తారు. అది మీ అదృష్టం అని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో తప్పకుండా వీరు తమకు చాలా ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. చిన్నారులతో గడపడంవల్ల కలిగే ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు.

సింహరాశి
స్నేహితులతో కలిసి, బంధువులతో కలిసి అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఇబ్బందులేమీ రావు. అలాగే ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. అద్భుతమైన లాభాలు మీ సొంతమవుతాయి. పెద్దల నుంచి ఆస్తి కలిసివస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
మకర రాశి
వ్యాపారాల్లో విజయాలు అందుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు. అనుకున్న సమయంలోనే పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు, బంధువులు, స్నేహితులతో చాలా చక్కగా మెసులుకుంటారు. పదిమందికి సాయం చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే దుబారా ఖర్చును నియంత్రించుకోవాల్సిన బాధ్యత ఈ రాశులవారిపైనే ఉంది.
వృషభరాశి
కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. వీరికి అదృష్టం కూడా సహకరిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యలో వారు బాగా రాణిస్తారు. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. భౌతికంగా సౌకర్యాలు పెరుగుతాయి. ఏ పనినైనా సానుకూలంగా చేసి విజయాన్ని సాధిస్తారు. ప్రతికూల ఆలోచనలను దూరం పెడతారు.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications