2026లో జంటగా జాక్ పాట్ ఇవ్వనున్న శని బుధులు
జ్యోతిష శాస్త్రంలో 2026 సంవత్సరం చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న సంవత్సరం. ఈ సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం ఊహించని ఫలితాలను ఇస్తాయి. 2026 సంవత్సరంలో అనేక గ్రహాలు అరుదైన సంయోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ముఖ్యంగా 2026 లో ఏప్రిల్ 20వ తేదీన శని బుధుల సంయోగం జరుగుతుంది. శని బుధుల సంయోగం మీనరాశిలో జరిగినప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
2026లో శని బుధుల కలయిక
జ్యోతిషశాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, తర్కానికి, వాక్చాతుర్యానికి, వ్యాపారానికి, కమ్యూనికేషన్ కి కారకుడిగా చెబుతారు. ఇక శనిని కర్మ దేవుడి గాను, క్రమశిక్షణ నేర్పే దేవుడు గాను చెబుతారు. అటువంటి శని, బుధుల కలయిక కారణంగా అదృష్టవంతులు అవుతున్న రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభరాశి వారికి శని బుధుల కలయిక కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కలయిక వృషభరాశిలో ఆదాయం మరియు లాభ గృహాలలో జరుగుతుంది. దీని కారణంగా వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ వనరుల నుండి డబ్బులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. వృషభ రాశి జాతకులు పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల నుండి ప్రయోజనాలను పొందుతారు.
మకర రాశి
శని బుధుల కలయిక కారణంగా 2026 సంవత్సరంలో మకరరాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక మకర రాశిలో 12వ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు ధైర్య సాహసాలతో ఉంటారు. ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. వ్యాపారాలలోను, కార్యాలయాల్లోనూ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీ పని ప్రశంసించబడుతుంది. సీనియర్ అధికారుల నుండి గుర్తింపు పొందుతారు.
మీనరాశి
శని బుధుల కలయిక 2026 లో మీనరాశి లోని లగ్న గృహంలో జరుగుతుంది. ఈ సమయంలో మీనరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ప్రాజెక్టులు, వ్యాపారాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి.. మీన రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వివాహితులు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహాలు మీకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది.
-
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications