పుష్కరాలలో పిండ ప్రదానం ఎందుకు చేస్తారు ?

Subscribe to Oneindia Telugu

సూలమైన దేహం లేకపోయినా, ఇంకా అతడు జీవించి ఉన్నాడనే విశ్వాసంతో పిండములు సమర్పిస్తారు. శిలపై నువ్వులతో కూడిన నీళ్లను వదలటం, దర్భలపై పెద్ద పిండాన్ని ఉంచటం (పూరక పిండం), దానిపై నువ్వులతో కూడిన నీళ్లను విడవటం, భంగరాజ, తులసి పత్రాలను ఉంచటం ఆచరించాలి. "ఓ పుండరీకాక్షా! ప్రేతకు ముక్తినివ్వ" అనే శ్లోకాన్ని పఠించటం, చివరకు నీళ్లలో విడిచిపెట్టటం మొదలైన విధులను ప్రేతత్వ విముక్తికై చేయాలని అంతేష్టి పద్దతిలో ఉంది.

ఈ పది రోజులు విడిచిపెట్టిన పిండాలతో ప్రేత సూక్ష్మశరీరం నిర్మాణమవుతుందని గరుడ పురాణం చెబుతుంది. చనిన వెనుక జీవుడు ఒక రకమైన మూర్భావస్థ వంటి దశ మూర్చరోగికి వలెనె మందులిచ్చివాని నట్టు శ్రాద్ధము అనే శక్తుల వల్ల వాని దోషాన్ని పోగొట్టవచ్చు. వానికి ఒక నూతన దేహాన్ని ప్రసాదించాలి.

అథర్వవేద సంబంధమైన పిండోపనిషత్తు ఇలా చెబుతుందిప్రథమ పిండ ప్రదానం వల్ల వానికి కలావికాసం, రెండో పిండంతో మాంసం, చర్మం, శోణితం (నెత్తురు), మూడో దానితో మతి, నాలుగో దానితో అస్థిమజ్జలు, ఐదో దానితో హసాంగుళులు, శిరస్సు ముఖం, ఆరో దానితో హృదయం, కంఠ తాలువులు, ఎనిమిదో దానితో వాక్కు తొమ్మిదో దానితో సమస్త ఇంద్రియాలు, పదో పిండంతో నానా భావాల వికాసం కలుగుతుందని చనిన వెనుక ప్రేత ఒక అతివాహిక శరీరం ధరిస్తుందని; అది అగ్ని, వాయు, ఆకాంశాంశలతో కూడి ఉంటుందని; అది మానవులకే అని,

significance of shradh, pind daan in pushkar

10రోజులు చేసిన పిండ దానాదులతో ప్రేతత్వముక్తి కలిగి, భోగ దేహం ధరిస్తుందని, సంవత్సరాంతాన చేసే సపిండీకరణం వల్ల మళ్లీ మూడో దేహం ధరిస్తుందని అనేక పురాణాలు తెలుపుతున్నాయి. "మూడు దేహాలు కావని, అతివాహిక లేక ప్రేతదేహం ఒకటి అని, భోగదేహం మరొకటని" గోవిందానందుడు ప్రాయశ్చిత్త వివేక వ్యాఖ్యానంలో రాశాడు. షోడశ శ్రాద్దాలు చేయకపోతే పిశాచంగా ఉంటుందని, షోడశ శ్రాద్దాలు మినహా మిగిలినవి తరవాత చేసినా పిశాచత్వం నుండి విడిపోలేడనే యముని వాక్యం తత్వార్ణ కౌముదిలో ఉంది. అది యాతనతో కూడిన శరీరమని బ్రహ్మపురాణం తెలిపింది. మహాపాపాలు చేసి మరణించినవారు సూలశరీరం వంటి ఆకారాన్ని పొంది నానా యాతనలు పడతారని పురాణ కథనం.

పిండాలు ఎవరికి చెందుతాయి ?

శ్రాద్దం పెట్టేటప్పుడు బ్రాహ్మణులను పిలిచి పెడతారు. వారు తిని తృప్తి పొందితే పెట్టేవాని పితృదేవతలు తృప్తిపడతారని విశ్వాసం. భోక్తలుగా నిమంత్రించిన బ్రాహ్మణులపై పితృదేవతలు నివసిస్తారని మనువు చెప్పాడు.

బ్రాహ్మణుల ద్వారా పితరులకు ఎలా ముడుతుందో చూడండి
"ఇమ మోదనం విదధే బ్రాహ్మణేషు విష్ణారిణం లోక జితం స్వర్గమ్ పమే మాక్షేష్ట స్వధయా పిన్వమానో విశ్వరూపా ధేనుః కామదు ఘా మే అస్తు" వేదం చెబుతుంది-

"బ్రాహ్మణుల సమీపాన ఉంటాను. ఇది స్వర్గప్రాప్తికి సాధనం. కామధేను తుల్య ఫలాన్ని ఇస్తుంది" అని అర్థం.
"పిలా తవ మయా దృష్ణా బ్రాహ్మణాంగేషు రాఘవ"
శ్రీరాముడు దశరథుని ఉద్దేశించి బ్రాహ్మణులకు పెట్టే సందర్భాన
"బ్రాహ్మణుల్లో నేను దశరథుని చూశాను"
అని సీత చెప్పినట్లు పద్మ పురాణం సృష్టిఖండంలో. బ్రాహ్మణులకే ఎందుకు పెట్టాలి?
ఇతరులకు పెట్టకూడదా? ముట్టదా ఏమిటి? ఇవన్నీ బ్రాహ్మణులు కల్పించిన రాతలని కొందరు వాదిస్తారు.

"శ్రోత్రియాయైవ దేయాని హవ్యకవ్యాని దాతృభి: అర్హత్తమాయ విప్రాయ తస్మై దత్తం మహాఫలమ్ ఏకైకమపి విద్వాంసం దైవే ప్శ్ర్యే చ భోజరయేత్ పుష్కలం ఫలమాప్నోతి నామంత్రజ్ఞాన్ బహూనపి సహస్రం హి సహస్రాణామన్న చాం యత్ర భుంజతే ఏకస్తాన్ మంత్రవిత్ ప్రీత: పర్వానర్షతి ధర్మతః" మంత్ర స్వరూపుడైన ఉత్తమ బ్రాహ్మణుడు మనం కోరిన కోరి కలను తీరుస్తాడు, తీర్పేట్ల చేస్తాడు. విద్యుత్తును రాగి తీగనుండి పంపుతున్నాం, కర్ర నుండి కాదు.

అలాగే బ్రాహ్మణ శరీరం ఒక చక్కని విద్యుత్ వాహకం. శ్రాద్దంలో శ్రోత్రియుడైన, వేదవేత్తయైన ఆచారవంతుడైన బ్రాహ్మణునిచే నియమించాలని, వేదం తెలియని వారు ఎంతమంది భుజించినా నిష్ఫలమని, వేదవేత్త ఒక్కరైనా చాలునని మనువు పేర్కొన్నాడు.

"కిం కులేన విశాలేన వృత్తహీనస్య దేహినః కృమయః కిం న జాయంతే సుగంధిపు" మంచి కులంలో పుట్టినా, శీలవంతుడు కాకపోతే నిష్ఫలం. సుగంధ పుష్పాల్లో క్రిమికీటకాదులు ఉండటం లేదా? అని అగ్గిపురాణ వాక్యం. "అపి విద్యాకులైర్యుక్తాన్ వృత్తహీనాన్ ద్వీజాధమాన్ అనర్గాన్ హవ్యకవ్యేషు వాడ్మాశ్రేణా పి నార్చయేతో వారెంత చదివినవారైనా, శీలంలేని బ్రాహ్మణులను పూజించరాదని, వాక్కుతో కూడా పూజించరాదని జాతుకర్ణ్యుడు అన్నాడు.

ఇంత గట్టిగా చెప్పటానికి కారణం-పితృదేవతలు వాయురూపంతో భోక్షలను ఆవహించి ఉంటారు కనుక ఈ మాట బ్రహ్మాండపురాణంలో దేవకార్యాల్లో బ్రాహ్మణుల విద్యాదులను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కాని, పితృకార్యాల్లో తప్పక పరీక్షించాలని మనువు చెప్పాడు. బ్రాహ్మణులకు పితృకార్యం దైవకార్యం కంటే గొప్పదని, తప్పనిసరి అని మనువు మాట. కర్తకు శరీరశుద్ది, ద్రవ్యశుద్ధి కర్తభార్య శుద్దిగా ఉండటం, స్థల శుద్ధి, మానసికశుద్ధి, మంత్ర, బ్రాహ్మణాదుల శుద్దులను ఏడింటిని స్కాందపురాణం పేర్కొన్నది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explains about significance of shradh, pind daan in pushkaras

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి