వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips: ప్రహరీ గోడలలో ఈ వాస్తు దోషాలుంటే తీవ్ర ఆర్ధిక నష్టాలు!!

|
Google Oneindia TeluguNews

ఇంటిని నిర్మించడానికి వాస్తు ఏ విధంగా అవసరమో, అలాగే ప్రహరీ గోడ నిర్మించటానికి కూడా వాస్తు అవసరమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రహరీ గోడలు పరిసరాల వాస్తు దోషాల నుండి ఇంటిని కాపాడతాయని సూచిస్తున్నారు. అందుకే ప్రహరీగోడ వాస్తుకు వాస్తు శాస్త్రంలో ప్రాధాన్యత ఇవ్వబడింది.

ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో వాస్తు నియమాలను పాటించకుంటే ఏం జరుగుతుంది?

ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో వాస్తు నియమాలను పాటించకుంటే ఏం జరుగుతుంది?

ప్రహరీ గోడలు నిర్మించడానికి అనేక వాస్తు నియమాలు ఉన్నాయని, దక్షిణం, పశ్చిమ దిశలో ఉన్న ప్రహరీ గోడలను ఎత్తుగా నిర్మించాలని, దృఢంగా నిర్మించాలని, తూర్పు, ఉత్తరం వైపునున్న ప్రహరీ గోడలను ఎత్తు తక్కువగా, కాస్త తక్కువ మందంతో నిర్మించాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో వాస్తు నియమాలను పాటించకుండా ఉంటే ఏం జరుగుతుంది? పాటిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అనే విషయాలను కూడా ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

తరుగు లేని సౌభాగ్యాల కోసం ఆ దిశలో గోడ ఇలా కట్టండి

తరుగు లేని సౌభాగ్యాల కోసం ఆ దిశలో గోడ ఇలా కట్టండి


ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో వాస్తు నియమాలను పాటించకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నియమాలను పాటిస్తే మంచి ఫలితాలను పొందుతారు. ప్రహరీ గోడలో పడమటి గోడ కన్నా తూర్పు గోడ ఎత్తుగా ఉంటే, ఆ ఇంట్లో ఉన్నవారు అనారోగ్యం పాలవుతారు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా కాకుండా తూర్పు గోడ కన్నా పడమటి గోడ ఎత్తుగా ఉంటే మంచి ఫలితం కలుగుతుందని తరుగు లేని సౌభాగ్యాలు ఆ ఇంట్లో ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఎప్పుడూ ప్రహరీ గోడ నిర్మాణం లో పడమటి గోడలు తూర్పు గోడల కంటే ఎత్తుగా నిర్మించుకోవాలి.

ఈ దిశలో ప్రహరీగోడ ఇలా ఉంటే అష్టైశ్వర్యాలు

ఈ దిశలో ప్రహరీగోడ ఇలా ఉంటే అష్టైశ్వర్యాలు


ఇక దక్షిణం గోడ కన్నా ఉత్తరం గోడ ఎత్తు ఉంటే సంపదకు విపత్తు సంభవిస్తుందని, ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా కాకుండా దక్షిణం గోడ, ఉత్తరం గోడ కన్నా ఎత్తుగా ఉంటే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి అని చెబుతున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం గోడ ఉత్తరం గోడ కన్నా ఎత్తుగా ఉండేలాగా నిర్మించుకోవాలి.

వంకరగా గోడలు నిర్మిస్తే కలిగే ఫలితాలివే

వంకరగా గోడలు నిర్మిస్తే కలిగే ఫలితాలివే


ఇక వంకరటింకరగా ప్రహరీ గోడలను నిర్మిస్తే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తూర్పు గోడ వంకరగా ఉంటే పురుషులకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని, వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. పడమటి కూడా వంకరగా ఉంటే వరుసగా అరిష్టాలను చూడాల్సి వస్తుందని, ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు అంతా చెడే జరుగుతుందని చెబుతున్నారు.

స్త్రీల ఆరోగ్యంపై వంకర ప్రహరీ గోడల ప్రభావం

స్త్రీల ఆరోగ్యంపై వంకర ప్రహరీ గోడల ప్రభావం


ఇక దక్షిణం గోడ వంకరగా ఉంటే ఆ ఇంట్లో స్త్రీల ఆరోగ్యం పూర్తిగా నాశనం అవుతుందని, తీవ్ర అనారోగ్య సమస్యలతో స్త్రీలు ఇబ్బందులు పడతారని వాస్తు శాస్త్రం చెబుతోంది . ఇక ఉత్తరం గోడ వంకరగా ఉంటే ఆ ఇంట్లో నివసించే స్త్రీలకు, సంపదకు హాని జరుగుతుందని, అది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రహరీ గోడలు కూడా వాస్తు నియమాల ప్రకారం నిర్మించబడితేనే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

vastu tips: ప్రహరీగోడను నిర్లక్ష్యం చెయ్యకండి? ప్రహరీగోడ వాస్తు నియమాలను తెలుసుకోండి!!vastu tips: ప్రహరీగోడను నిర్లక్ష్యం చెయ్యకండి? ప్రహరీగోడ వాస్తు నియమాలను తెలుసుకోండి!!

English summary
Experts in Vastu Shastra say that if the retaining walls or compound walls are curved, many disasters will happen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X