Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vastu tips: పుట్టెడు ఆర్ధిక సమస్యలా? ఈ సింపుల్ వాస్తుచిట్కాలతో మీ డబ్బుసమస్యలు దూరం!!

ఇంట్లో వాస్తు దోషం ఉంటే కుటుంబ పురోభివృద్ధిలో ఆటంకాలు ఎదురవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే డబ్బు నిలవదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి వాస్తు దోషాలను సరిదిద్దుకుని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటం కోసం అనేక వాస్తు చిట్కాలను సూచించింది వాస్తు శాస్త్రం.

ధన ప్రాప్తి కలగాలంటే ఈ వాస్తు చిట్కాలు పాటించాలి

ధన ప్రాప్తి కలగాలంటే ఈ వాస్తు చిట్కాలు పాటించాలి

వాస్తు శాస్త్రం ప్రకారం ధన ప్రాప్తి కలగాలంటే, ధన నష్టం జరగకుండా ఉండాలన్న ప్రధానంగా ఇంట్లో గుర్తుంచుకోవలసిన దిక్కు ఉత్తరం దిక్కు. ఉత్తరం దిక్కున సంపద దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిశను కుబేరుడు పరిపాలించే కారణంగా ఉత్తర దిశ వైపు చేసే పనులలో దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యం. మన ఇంట్లో బీరువా ఉత్తరం వైపు తలుపు తెరుచుకునే విధంగా పెట్టుకోవడం వల్ల సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉత్తరం వైపు పొరబాటున కూడా చెత్తా చెదారం పడెయ్యకూడదని చెప్తారు.

 ఇల్లు శుభ్రంగా, మనీ ప్లాంట్ వంటి మొక్కలు ఆ దిశలో

ఇల్లు శుభ్రంగా, మనీ ప్లాంట్ వంటి మొక్కలు ఆ దిశలో


ఇక ఇదే సమయంలో ఎక్కడ శుభ్రత మరియు గృహాలంకరణ చక్కగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తున్నారని నమ్ముతారు. కాబట్టి ఇంటిని చెత్తా చెదారంతో నింపకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నీట్ గా పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో చిరాకులు తొలగిపోయి, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంట్లో మనీ ప్లాంట్ ను కూడా వాస్తుకు అనుకూలంగా, ఉత్తర దిశలో పెడితే అది మెరుగైన ఫలితాలను ఇస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరదిశలో మనీ ప్లాంట్ ను నేలపై పెట్టడం వల్ల శుభాలు చేకూరుతాయని చెబుతున్నారు.

 ఆ దిశలో కుబేరుడి ఫోటో.. నీళ్ళ లీకేజీలు లేకుండా ఉంటేనే..

ఆ దిశలో కుబేరుడి ఫోటో.. నీళ్ళ లీకేజీలు లేకుండా ఉంటేనే..


ఇక ఉత్తర దిశలో కుబేరుడి చిత్రాన్ని పెట్టడం వల్ల సంపద పెరుగుతుందని, ఆర్థిక స్థితి మెరుగు పడుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే సమయంలో జీవితంలో పురోగతిని సాధించాలంటే, సంపాదించిన ధనం నిలబడాలంటే ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఉన్న నీళ్ల ట్యాంకుల నుండి, కుళాయిల నుండి నీరు కారడం కూడా ధన నష్టానికి కారణమని చెబుతున్నారు. ఎక్కడా నీళ్ల లీకేజీలు లేకుండా ఇంటిని చూసుకుంటే ఆర్ధిక నష్టం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

 ఇంట్లో దక్షిణ దిశలో పూజగది లేకుండా చూసుకోండి

ఇంట్లో దక్షిణ దిశలో పూజగది లేకుండా చూసుకోండి


ఇక ఇంటి తలుపులు, కిటికీలు ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచితే ఇంట్లోకి ధన ప్రవాహం కొనసాగుతుందని సూచిస్తున్నారు. ఇంట్లో దక్షిణం దిక్కు గోడపై పూజ గది ఉంటే డబ్బుకు సంబంధించిన భయంకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇంట్లో పూజ గదిని ఎప్పుడూ తూర్పు దిశలోనో, ఈశాన్య దిశలోనో ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. మొత్తానికి ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే కచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+