vastu tips: మీ ఇంటిని ఆనుకుని ఈ దిశల్లో స్థలాలను కొంటే అదృష్టం.. ఐశ్వర్యం!!
మన ఇళ్లకు పక్కనే ఉన్న ఏ వైపు స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు? ఏ వైపు స్థలాన్ని కొనుగోలు చేయకూడదు అనేది? వాస్తు శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం. చాలామంది ఆస్తులను వృద్ధి చేసుకునే క్రమంలో తమ స్థలానికి ఆనుకుని ఉండే స్థలాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అదేవిధంగా నిర్మాణాలను కూడా కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే అలా వాటిని కొనుగోలు చెయ్యటానికి కూడా వాస్తు నియమాలు ఉంటాయన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎలా పడితే అలా డబ్బులు ఉన్నాయని ఏది పడితే అది కొంటే ఒక్కోసారి దారుణ పరిస్థితులను చూడాల్సి వస్తుంది.

ఇంటికి ఆనుకునే ఉన్నా వాస్తు నియమాలకు విరుద్ధమైన ప్లాట్లు కొనొద్దు
మన సమాజంలో చాలామంది తమ ఇళ్లకు ఆనుకుని ఉన్న ఇళ్ల స్థలాలు, ఇళ్ళు తమకు కలుస్తాయి అనుకుంటే వాటిని కొనుక్కుని తమ ఆస్తి లో కలుసుకుందామని అనుకుంటారు. ముఖ్యంగా లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఈ విధమైన ఆలోచనలు చేస్తారు. అయితే మన స్థలానికి పక్కనున్న ప్లాట్లను కలుపుకునే విషయాల్లో వాస్తు శాస్త్ర నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఉండే ఫ్లాట్లను కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు.

మీ స్థలానికి తూర్పు, ఉత్తరం దిశల్లో ఉన్న స్థలాలు కొంటే అదృష్టం
మన ఇంటికి గాని, స్థలానికి గాని ఉత్తరం వైపున కానీ తూర్పు వైపున ఖాళీ ఉన్న స్థలాన్ని, ఇంటిని ఎటువంటి ఆలోచన చేయకుండా కొనుగోలు చేసుకొని, మన ఆస్తితో కలుపుకోవచ్చు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. మన ఇంటికి తూర్పు వైపున గానీ, ఉత్తరం వైపు ఉన్న స్థలం కానీ, ఇళ్ళు కాని కొనుగోలు చేసి కలుపుకుంటే, తూర్పు, ఉత్తరం దిశలలో ఆస్తిని పెంచుకుంటే ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. ఇవి చాలా అదృష్టాన్ని తెస్తాయని అంటున్నారు. ఆరోగ్యం, ధనం, ఆయుష్షు, ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నట్టింట సిరి నాట్యం చేస్తుందని చెబుతున్నారు.

దక్షిణ, పడమర దిశల్లో స్థలాలు కొంటే జరిగేదిదే
జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా అభివృద్ధి చెందుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సలహా ఇస్తున్నారు. కాబట్టి ఎప్పుడైనా మీ స్థలానికి తూర్పు ఉత్తర దిక్కుల్లో ఉన్నటువంటి ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక దక్షిణ, పడమర దిశలో ఉన్న స్థలాలను పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు .మీ స్థలానికి దక్షిణం వైపు ఉన్నటువంటి స్థలం ఉచితంగా ఇచ్చినా తీసుకోకూడదని, అది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు .

నైరుతి, ఆగ్నేయ, వాయువ్య మూలల స్థలాలను కొనకండి
నైరుతి మూలన ఉన్న స్థలాన్ని, అలాగే ఆగ్నేయ మూల ఉన్న స్థలాన్ని, వాయువ్య మూలన ఉన్న స్థలాన్ని కూడా ఎట్టి పరిస్థితులలోనూ కొనుగోలు చేసి కలుపుకోకూడదని చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున అలా కలుపుకుంటే జీవితంలో అన్ని అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, భయంకరమైన ఎదురు దెబ్బలు తగులుతాయి అని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా నైరుతి మూల అంగుళం భూమిని కూడా అసలు ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదని, ఊరకనే ఇచ్చినప్పటికీ నైరుతి మూల ఉన్న భూమి తీసుకోవటం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని స్థలాలు కొనుక్కునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications