vastu tips: పిల్లి ఎదురుపడితే అశుభసూచకం.. దీని వెనుక పెద్ద కారణమే!!
హిందూ సంప్రదాయంలో, ఆచార వ్యవహారాలలో అనేక విశ్వాసాలు ఉంటాయి. బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే అపశకునం అన్న భావన ఎప్పటి నుంచో మనకు ఉంది. సనాతన సంప్రదాయాలకు విలువనిచ్చే భారతదేశంలో ఎవరైనా బయటకు వెళుతున్న క్రమంలో పిల్లి ఎదురైతే కాసేపు ఆగి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తారు.

పిల్లి ఎదురైతే అశుభ సూచకం .. ఎందుకు ?
కొన్ని దేశాల్లో పిల్లి ఎదురైతే మంచి జరుగుతుందని భావించే వారు లేకపోలేదు. పిల్లులకు గుడి కట్టి మరీ పూజించే వారు కూడా ఉన్నారు. కానీ మనదేశంలో పిల్లి ఎదురైతే అపశకునం అని భావిస్తారు. వెళ్ళే పని నాశనం అవుతుందని నమ్ముతారు. అసలు ఎందుకు పిల్లిని అశుభ సూచకంగా భావిస్తారు? పిల్లుల వల్ల కలిగే హాని ఏమిటి? అనే విషయాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

యజమాని నాశనం కోరుకునేది పిల్లి
పిల్లి అశుభానికి సూచనగా చెబుతారు. పిల్లి ఎప్పుడు యజమాని మంచి కోరుకోదని, దానిని ఎంత ప్రేమగా పెంచినా యజమాని నాశనాన్ని కోరుకుంటుంది చెబుతారు. ప్రతినిత్యం పిల్లికి పాలు పోసి పెంచినా, అది మళ్లీ ఇంట్లో ఉన్న పాలను దొంగతనంగా తాగాలని ప్రయత్నిస్తుందని, అలాంటి దుష్టబుద్ధి ఉన్న పిల్లిని బయటకు వెళ్ళేటప్పుడు చూస్తే మంచి జరగదని భావిస్తారు. కుక్క యజమాని మంచి కోరితే, విశ్వాసంగా ప్రవర్తిస్తే, పిల్లి మాత్రం యజమాని నాశనం కోరుకునే దుర్బుద్ధి ఉంటుందని చెప్తారు.

దరిద్రదేవతకు చిహ్నం పిల్లి
అంతేకాదు పిల్లిని దరిద్ర దేవతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాలలో సంపదకు దేవత మహాలక్ష్మి అయితే పేదరికానికి, ఇబ్బందులకు దేవత అలక్ష్మి, అంటే దరిద్ర దేవత అని భావిస్తారు. పిల్లి దరిద్రాన్ని, ఇబ్బందులను మోసుకు వస్తుంది కాబట్టి పిల్లిని భారతీయులు దురదృష్టానికి చిహ్నంగా చూస్తారు. అందుకే పిల్లి ఎదురుపడితే కాసేపు ఆగి వెళ్లాలని భావిస్తారు. ఒకవేళ పట్టించుకోకుండా వెళ్తే కచ్చితంగా వెళ్ళిన పని కాకపోగా చిరాకు కలుగుతుందని చెప్తున్నారు.

చాలామంది ఇళ్ళలో పిల్లులను పెంచటానికి కారణం ఇదే!!
ఎవరైనా ఇళ్లల్లో పిల్లులను పెంచుకుంటే, అవి కుక్కలాగా విశ్వాసాన్ని చూపించే జంతువులు కాదనే విషయాన్ని గుర్తించాలి. గతంలో పిల్లులను వ్యవసాయం ఎక్కువగా చేసుకునే ఇళ్లలో పెంచేవారు. అందుకు కారణం లేకపోలేదు. వ్యవసాయం చేసే వారి ఇళ్ళల్లో వడ్ల బస్తాలు ఉండటంవల్ల, ధాన్యం తినడం కోసం ఎలుకలు చేరుతాయి. ఈ ఎలుకల బారి నుండి ధాన్యాన్ని రక్షించుకోవడం కోసం గతంలో ఇళ్లల్లో పిల్లులను పెంచేవారు. సదరు పిల్లులు ఎక్కడపడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడం, ఇంట్లో ఉన్న పాలు పెరుగులను స్వాహా చేయడం యజమానులకు ఇబ్బంది కలిగించినప్పటికీ, ఎలుకల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లులను పెంచేవారు.

పిల్లి శరీరం మీద ఉన్న వెంట్రుకలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి.. పిల్లి ఏడ్చినా నష్టమే
అంతేకాదు పిల్లి శరీరం మీద ఉన్న బొచ్చు అనేక అనారోగ్యాలకు మూల కారణం. పిల్లులను ఇళ్లలో పెంచుకునే వారికి అనేక రోగాలు వస్తాయని చాలామంది పెద్దలు చెబుతున్నారు. ఏ రకంగా చూసినా పిల్లలు శ్రేయస్సును కలిగించవని అందుకే మన భారతీయ సనాతన ధర్మంలో పిల్లిని అశుభ సూచకంగా పరిగణిస్తారని చెబుతున్నారు. ఇక పిల్లి ఎదురుపడితేనే కాదు, ఏడ్చినా కూడా అశుభసూచకమని, త్వరలో ఏదో ఒక చెడు జరిగే అవకాశం ఉందని చెబుతారు.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications