వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో తరచూ చిరాకులా? ప్రతికూలశక్తి ప్రభావం కావచ్చు.. ఈ టిప్స్ పాటిస్తే అంతా శుభమే!!

|
Google Oneindia TeluguNews

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ చిరాకులు ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్టు భావిస్తారు. అన్నీ ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వచ్చి పడుతున్నా, అనారోగ్యాల బారిన పడుతున్నా, అలాగే తరచూ ఇళ్లల్లో ఘర్షణలు జరుగుతున్నా అలాంటి ఇళ్లల్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇళ్లల్లో సానుకూల శక్తి నింపి ప్రతికూల శక్తిని బయటకు పంపించేలా చిన్నచిన్న చిట్కాలను తెలుసుకుంటే ప్రతి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 గాలి వెలుతురూ చూసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి

గాలి వెలుతురూ చూసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి


ఇక చిట్కాల విషయానికి వస్తే ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా ఉన్న ఇల్లు ప్రతికూల శక్తులను బయటకు పంపిస్తుంది. కాబట్టి సూర్యకాంతి ఇంట్లోకి పడేలాగా, గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. అంతేకాదు ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించడానికి ఇంటిని ఎప్పుడూ చక్కగా సర్దుకోవాలి. చిందరవందరగా ఉండే ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఫర్నిచర్ ను తరచుగా సర్దుకుంటూ ఉండడంవల్ల, ఇంట్లో బూజు లేకుండా చూసుకోవడం వల్ల ప్రతికూల శక్తి బయటకు పోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 ఉప్పునీటితో ఇల్లు శుభ్రం చెయ్యాలి, మొక్కలను పెంచాలి

ఉప్పునీటితో ఇల్లు శుభ్రం చెయ్యాలి, మొక్కలను పెంచాలి


అంతేకాదు ఇళ్లలోని ప్రతికూల శక్తిని తొలగించడం కోసం ఇంటిని అప్పుడప్పుడు ఉప్పు తో శుభ్రం చేయాలి ఉప్పు నీళ్లతో ఇంటిని తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని చెబుతున్నారు. ఇంట్లో ప్రతికూల ఫలితాలను తగ్గించడానికి ఇంట్లో ఉన్న గదుల్లో నాలుగు మూలల ఉప్పును పోసినప్పటికీ ఫలితముంటుందని చెబుతున్నారు. ఇక ఇంట్లో ప్రతికూలతలను తొలగించడానికి మొక్కలను పెంచడం కూడా ఒక మంచి మార్గమని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంట్లోకి వచ్చే కార్బన్ డయాక్సైడ్ ను మొక్కలు గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేయడం వల్ల ఇంట్లో ఉన్న వారు ఆరోగ్యంగా ఉంటారని, ప్రతికూల శక్తిని తొలగించడానికి మొక్కలు పెంచడం కూడా ఒక సురక్షితమైన మార్గం అని చెబుతున్నారు.

అరోమా ఆయిల్స్, సెంటెడ్ క్యాండిల్స్ , కర్పూరం వెలిగించటం మంచిది

అరోమా ఆయిల్స్, సెంటెడ్ క్యాండిల్స్ , కర్పూరం వెలిగించటం మంచిది


ఇదే సమయంలో ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించడానికి అరోమా ఆయిల్స్ ను ఉపయోగించడం, సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించటం, కర్పూరాన్ని, అగర్బత్తి లను వెలిగించడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతికూల శక్తులకి దూరంగా ఉండడానికి ఇంట్లో విండ్ చైమ్స, టిబెటన్ సింగింగ్ బౌల్స్ ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. ప్రతికూల శక్తుల నుండి చాలా దూరంగా ఉండడానికి హీలింగ్ స్పటికాల ఉపయోగం మంచిదని చెబుతున్నారు.

 రంగులు, నెమలి ఈకలు కూడా ప్రతికూల శక్తిని తొలగిస్తాయి

రంగులు, నెమలి ఈకలు కూడా ప్రతికూల శక్తిని తొలగిస్తాయి


ఇంట్లో ప్రతికూల శక్తులను తరిమివేయడానికి రంగులు కూడా కీలక భూమిక పోషిస్తాయని చెబుతున్నారు. ఇంట్లో ఎరుపు నలుపు లేదా బూడిద రంగులు ఎక్కువగా ఉపయోగించకుండా ఉండాలని, ఈ రంగుల వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని చెబుతున్నారు. మిగతా రంగులు కూడా గదికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోవడం అవసరమని చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో నెమలి ఈకలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని చెబుతున్నారు. ఇంట్లో నెమలి ఈకలను ఉంచటం వల్ల అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయని దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

English summary
Frequent annoyance at home? Negative energy effect may be the reason.. Vastu experts say that all is well if you follow these tips.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X