Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

weekly horoscope:వచ్చేవారం లక్ష్మీ నారాయణ రాజయోగంతో ఈ రాశులవారికి తిరుగేలేదు

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి చివరి వారంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కుంభ రాశిలో శుక్రుడు, బుధుడి కలయిక వల్ల ఏర్పడే శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కొన్ని రాశుల జాతకులు నక్కతోక తొక్కుతారు. ఈ శుభ యోగం ప్రభావంతో కొన్ని రాశులు ఆర్థికంగా పురోగమిస్తూ, కెరీర్‌లోనూ మెరుగైన ఫలితాలను చూస్తాయి. తమ కృషికి తగిన ప్రతిఫలం లభించి, అదృష్టం కలిసి వచ్చే సూచనలున్నాయి.

లక్ష్మీనారాయణ యోగం

ఈ వారం లక్ష్మీ నారాయణ యోగం కారణంగా మేషం, తుల, వృశ్చిక, కుంభ రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. వారి ఆర్థిక స్థితి బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రత్యేకించి, ఈ రాశుల వారు లాభదాయకమైన ఒప్పందాలను కుదుర్చుకోవడంతో పాటు, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కోరికలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఈ వారం లక్ష్మీనారాయణ రాజయోగంతో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

weekly horoscope this week lakshmi narayana rajyoga gives luck and blessings to these zodiac signs

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. ఆర్థికంగా అనేక శుభ ఫలితాలుంటాయి. వారం ప్రారంభం వ్యాపార విస్తరణకు, కొత్త పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. వారం చివరి నాటికి, ఎప్పటి నుండో వసూలు కాని బకాయిలను తిరిగి పొందే అవకాశం ఉంది. ఇది మేషరాశి జాతకుల ఆర్థిక స్థిరత్వాన్ని మరింత పెంచుతుంది.

తులా రాశి

తులా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం ఈ వారం పలు ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో తులారాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. స్నేహితుల కోసం, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ వారంలో ఆర్థికపరమైన వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. అయినప్పటికీ, ఇతరుల ప్రభావంతో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వారం చివరిలో ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచే అన్ని విధాలా కలిసి వస్తుంది. శుభకార్యాల కోసం ఈ వారం గణనీయంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో మెరుగైన ఫలితాలు లభిస్తాయి. మీరు చేపట్టిన పనులన్నీ ఈ వారం సకాలంలో పూర్తవుతాయి. ఈ వారం మీ దీర్ఘకాలిక కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అంతేకాకుండా, అనేక లాభదాయకమైన ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా వృశ్చికరాశి జాతకులు పురోగతి సాధిస్తారు.

కుంభరాశి

కుంభ రాశి జాతకులకు ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు శుభవార్తలు వింటారు, వర్తక వ్యాపారాలు చేసేవారు అన్ని విధాలా లాభాలను పొందుతారు. ఈ వారం ఏ పని చేసినా సరే విజయలక్ష్మి వరిస్తుంది. అన్ని విధాలా శుభదాయకంగా ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+