వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రావణ శుద్ద పూర్ణిమ ప్రత్యేకతలు: రాఖీ పౌర్ణమి అని కూడా ఎందుకంటారు?

తోరం పట్టు దారంతో కాని, నూలు దారంతో కాని పోస్తారు. మచ్చి బంగారం కొద్దిగా ఆ తోరానికి ముడివేస్తారు.

|
Google Oneindia TeluguNews

గమనిక
గ్రహణము కారణంగా - రాఖీలు కట్టడము, మధ్యాహ్నము 12గం. లోపే పుర్తి చేసుకోవాలి.

నార్లీ పూర్ణిమ, జంధ్యాల పన్నమి, పన్నమి, నార్లీ పన్నమి

శ్రావణపూర్లిమే నార్లీపూర్ణిమ. ఈ పర్వానికి పౌరాణిక సంబంధం వున్నట్లు కనిపించదు. ఈనాడు గుజరాతి బ్రాహ్మలు తమ పోషకుల్ని దర్శించి వారి ముంజేతికి రాఖీ కడతారు. రాఖీ అంటే తోరము. అందుచేత ఈ పర్వానికి రాఖీ పూర్ణిమ అనేపేరు కూడా వచ్చింది. తోరం పట్టు దారంతో కాని, నూలు దారంతో కాని పోస్తారు. మచ్చి బంగారం కొద్దిగా ఆ తోరానికి ముడివేస్తారు. క్రింది అర్థము వచ్చే మంత్రం చదువుతూ ఆశీర్వదిస్తారు.

"ఓరక్షా! దానవ ప్రభువైన బలిని బంధించిన దుష్కార్యాలను అన్నిటినీ నీ యందు నేను బంధిస్తున్నాను. నీవు కదలకుండా వుందువు గాక!" ఇట్లా కట్టడాన్నే రక్షాబంధనమంటారు.

speciality of shravana shuddha pournami

బ్రాహ్మలు ఈనాడు శ్రావణి పర్వాన్ని చేస్తారు. గత సంవత్సరం చేసిన పాపాల పరిహారార్థం బ్రాహ్మలు ఈ పర్వాన్ని చేస్తారు. ఋగ్వేద, యజుర్వేద శాఖల రెండింటికీ ఈ పర్వం ముఖ్యమైంది. ఈ రెండు శాఖల బ్రాహ్మలు ఒకరి ఇంట ఒకరు భోజనాలు చేసినా పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోరు.

శ్రావణి పర్వాన్ని బ్రాహ్మలు సంఘంగా చేరి చేస్తారు. ఇందులో ప్రథమకృత్యం పంచగవ్యప్రాశనం. పిమ్మట గణపతి పూజ; తర్వాత హోమము.

ఆ మీద ఆ బ్రాహ్మలు సప్తమహరులను పూజిస్తారు. సప్తమహరులు ఎవరనగా శతపథ బ్రాహ్మణం ప్రకారం గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని వసిష్ఠ, కశ్యప, అత్రులు, మహాభారత ప్రకారం మరీచి, అత్రి, అంగీరస, పులహ, క్రతు, పులస్య వసిష్ణులు.

పూజ పూర్తి అయూక తిరిగి హోమం చేస్తారు. తరువాత పురోహితుడికి దక్షిణ ఇస్తారు.
ఇది ఉపవాసాలకు ఉద్దిష్టమైన పండుగ కాదు. హిందువుల్లో అన్ని తరగతుల వారు ఈ పర్వాన్ని చేస్తారు. ఆనాడు మధురపదార్థాలు చేసుకుని భుజిస్తారు. వర్షాకాలపు రాకకు అందరూ సంతోషిస్తారు.

Recommended Video

Karthika Pournami celebrations at Yadadri | యాదాద్రిలో పౌర్ణమి వేడుకలు | Oneindia Telugu

బొంబాయిలో ఈనాడు ప్రజలు కొత్తబట్టలు కటుకుని సాయంకాలం చౌపతి సముద్రతీరానికి పోయి వరుణదేవుని తృప్తి కోసం కొబ్బరికాయలు సమర్పిస్తారు. కాబట్టే దీనికి నారికేళపూర్ణిమ అనీ, నార్లీ పూర్ణిమ అని పేరు వచ్చింది.
పూనాలో హిందువులు ఈనాడు ఒక ఉత్సవంగా ఏర్పడి బ్యాండుమేళంతో మూలా, ముత్తా అనే నదుల సంగమస్థానానికి వెళతారు.

ఆ ఉత్సవం వెంట నాలుగు గుర్రాలు లాగే రథం వెళుతుంది. ఆ రథం మిూద ఒక కొబ్బరి కాయ ఉంటుంది. ఆ నదీసంగమస్థానంలో ఆ కొబ్బరి కాయను సమర్పిస్తారు. అని కొధారి అందించిన సమాచారం.
శ్రావణపూర్ణిమను మాళవదేశంలో రాఖీపన్నమి అంటారు. సోదరసోదరీ ప్రేమను వ్యక్తపరిచే పర్వాల్లో ఇది చాలా ముఖ్యమైనది.

రాఖీ అనేది ఒక ఆభరణం. మంచి రంగుతో ఒప్పే దారంతోను, కాగితంతోను చేస్తారు. దానిని ఒక తోరానికి ఆకట్టి ఆ తోరాన్ని సోదరి సోదరుని ముంజేతికి ఈ పండగనాటి ఉదయాన్ని కట్టుతుంది.
మధ్యాహ్నం సోదరుడు తన యింటిలో కాని, తన సోదరి ఇంటిలో కాని తన సోదరి వండి వడ్డించిన అన్నాన్ని తింటాడు.

భోజనానంతరం సోదరి సోదరుడికి హారతి ఇస్తుంది. దీపపుకుందిలో రెండు జతల వత్తులు వేసి నూనెపోసి వెలిగిస్తుంది. ఆ కుందిని ఒక పల్లెంలో పెడుతుంది. ఆ పల్లెంలోనే కొద్దిగా అక్షింతలు, రెండు పోకలు ఉంచుతుంది.
సోదరుడు తూర్పు ముఖంగా పీట విూద కూర్చుంటాడు. అప్పడు సోదరి అతనికి కుంకుమతో బొటు పెట్టుతుంది. అతని మీద అక్షింతలు చల్లుతుంది.

పిమ్మట ఆమె ఆ పళ్లాన్ని అతని తలచుటూ తిప్పతుంది. తరువాత ఆ పల్లెంలోని పోకను ఒక దానిని పుచ్చుకొని అతని తల చుటూకుడినుంచి ఎడమకు తిప్పి తిరిగి పల్లెంలో వేస్తుంది. తరువాత రెండో పోకను కూడా పుచ్చుకుని అతని తలచుటూ ఎడమనుంచి కుడికి తిప్పి దానిని కూడా పల్లెంలో వేస్తుంది. అతని కుడి ముంజేతికి అప్పడు ఆమె ඌෂී) కట్టడంతో తంతు ముగుస్తుంది. అనంతరం సోదరుడు సోదరికి పటు చీరె, రవికెల గుడ్డ బంగారంతో చేసిన నగ(వెండితో చేసిన నగ నిషిద్దము) కాని లేకపోతే కొంత రొక్కం కాని యిస్తాడు.

ఈ డబ్బు ఆమె సొంతం. ఆమె వివాహిత అయితే ఆమె భర్త కూడా ఈ ధనాన్ని వాడుకోకూడదు.

English summary
Shravan Purnima or Shravana Pournami, The poornima day in Shravan month(July-Aug) is one of the most auspicious as per hinduism
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X