రాశిఫలాలు: ఉద్యోగాల్లో ఏ రాశివారికి ఎలా ఉంటుంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

2018లో ఉద్యోగాలు ఎలా ఉంటాయి, వృత్తిలో మీరు సాధించే విజయాలు ఏమిటి అనే జాతకాలను ప్రముఖ జ్యోతిష్కుడు అందించారు.

 మేషం:

మేషం:

ఈ రాశివారికి 2018లో కెరీర్ అద్భుతంగా ఉంటుంది. నూతన సంవత్సరాన్ని మీరు మంచి అవకశాలతో ప్రారంభిస్తారు. జనవరి నుంచి ఫిబ్రవరి చివరి వరకు మీకు అత్యంత కీలకైమైన సమయం. సరైన దిశను ఎంచకోవడంలో మీరు విజయం సాధిస్తారు. సంవత్సరం ప్రారంభంలో మొత్తంగా మీ కెరీర్‌ల నూతనత్వాన్ని పొందుతారు. కొత్త అవకాశాలు పొంది ముందుకు సాగుతారు. ఈ పరిణామం ద్వారా మీర ప్రయోజనం పొందగలరు.

మే నెల మధ్యలో మీరు మీ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సహనం పాటిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఆవేశంతో వ్యవహరించకూడదు. అంగాకరుడు తిరోగమన దిశలో ఉంటాడు కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు ఏవీ తీసుకోకూడదు. సహోద్యోగులతో సంయమనంతో వ్యవహరించండి. ఉన్నతాధికారులతో వాగ్వివాదాలకు దిగవద్దు. మీ బాస్‌కు తప్పించుకునే పద్ధతిలో సమాధానాలు చెప్పకూడదు. మీ అధికారి కోణం నుంచి విషయాలను చూడడానికి ప్రయత్నించండి. మీ ఉన్నతాధికారులను, సీనియర్లను మీ దృష్టితోనే చూడకూడదు. వారితో సంభాషించేటప్పుడు మర్యాదగా వ్యవహరించండి. అలా చేస్తే మీ ప్రయోజనాలకు భంగం వాటిల్లదు.

వృషభం

వృషభం

ఈ రాశివారికి 2018లో శనిప్రగతి మార్గంలో పయనించడానికి ఉపకరిస్తుంది. వృత్తిలో మీరు ముందుకే సాగుతారు. అయితే, అభివృద్ధికి శ్రమించాల్సి ఉంటుంది. కొంత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వృత్తిలో ప్రగతి ఎదురయ్యే ఆటంకాలను, అవాంతరాలను తొలగించుకోవడానికి సిద్ధపడాలి. మీరు ప్రగతి సాధిస్తారు

అయితే ముందుకు సాగడానికి పలు ఆటంకాలను అధిగమించాల్సి ఉంటుంది. మే నెల మధ్య భాగంలో రొటీన్ బిజీలో పడిపోతారు. మీరు అన్ని విధాలా శ్రమించాల్సి ఉంటుంది. ఒత్తిడిని కూడా భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఫలితం వస్తుంది. ఇప్పుడు పెట్టే శ్రమ మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

ప్రగతి, ఆనందం మీకు నల్లేరు మీద బండి నడక కాదు. కఠిన శ్రమతో మాత్రమే మీరు ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు ప్రాజెక్టు పనులపై విదేశాలకు వెళ్లే అవకాశం రావచ్చు. అది మీ వృత్తికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా కూడా మీకు బాగుంటుంది. సంవత్సరం చివరి మూడు నెలల్లో వృత్తి ప్రగతి సాధిస్తారు. దీన్ని బట్టి 2018 మీకు బాగానే ఉండబోతోంది.

మిథునం

మిథునం

ప్రధానమైన రెండు గ్రహాలు కర్మకు సంబంధించి పదో గృహంలో వివిధ దిశల్లో సంచరిస్తున్నాయి. కర్మకు సంబంధించిన బృహస్పతి దాన్ని నిర్దేశిస్తాడు. మిథునం పదో గృహాన్ని నిర్దేశిస్తుంది. దీన్ని బట్టి 2018లో మిథునం బలంగా ఉంటుంది. అందువల్ల వృత్తిలో మీరు ప్రగతి పథంలో పయనించడానికి ఉత్సాహకరమైన అవకాశాలు వస్తాయి. మీకు వచ్చే సదవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

పని విషయంలో మీరు శుభవార్త వింటారు. మీ బాస్ మీ పట్ల ఉదారంగా వ్యవహరిస్తారు. దాంతో మీరు మరింత ఉత్సాహంతో, సానుకూల దృష్టితో ముందుకు సాగుతారు. అది పని సమర్థతను పెంచుతుంది. మీకు అమితమైన ప్రోత్సాహం లభించి, మీ పనితీరు మెరుగుపడుతుంది.

మీరు మీ బాస్‌తో పంచుకునే మంచి విషయాలు పని విషయంలో మీకు మరింత ప్రోత్సహాన్ని ఇస్తుంది. ఉద్యోగులకు పనిలో ముఖ్యమైన లక్ష్యాన్ని అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయంలో మే మధ్యభాగం మీకు అత్యంత కీలకమైంది. ఈ సవాల్‌ను అధిగమించడానికి మీ నైపుణ్యాలను, అనుభవాన్ని పెట్టాల్సి ఉంటుంది.

కర్టాటకం

కర్టాటకం

ఉద్యోగులకు ఈ ఏడాది అంత సులభమైన విషయమేమీ కాదు. రోజువారీ కార్యకలాపాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఎప్పటికప్పుడు సవాల్‌గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు గడువులోగా పనులు పూర్తి చేయడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇటువంటి స్థితిలో కనీసం మీకు సహోద్యోగుల సాయమైన ఉండాలి. అందువల్ల సహోద్యోగులతో సామరస్య వాతావరణాన్ని కల్పించకోవాల్సి ఉంటుంది.

అర్హత ఉన్నప్పటికీ మీకు పదోన్నతి రాదు. అది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. మీ జన్మ కుండలిలోని గ్రహాలు సహకరిస్తే తప్ప మీరు ముందుకు సాగలేరు. అయితే, అసంతృప్తి మీరు చేసే పనిపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడండి. మీరు ముందుకు సాగుతూ తీవ్రమైన శ్రమ చేస్తూ సాగండి.

జీవితంలో ఆటంకాలు, అపజయాలు సర్వసాధారణం. వాటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడండి. వాటిని సరైన స్పూర్తితో తీసుకోవాలి. తద్వారా మీరు అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు.

సింహం

సింహం

ఉద్యోగులైనా, ఫ్రీలాన్సర్ అయినా మీరు వృత్తి మీద దృష్టి పెడుతారు.అది మీ అభివృద్ధికి దోహదపడుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగం మారాలని అనుకునేవారికి సదవకాశాలు వస్తాయి. ఆటంకాలు వస్తుంటాయి గానీ సమర్థంగా పనిచేయడం ద్వారా అధిగమిస్తారు. ఉద్యోగంలో సౌకర్యంగా ఉండలేరు.

నిర్ణీత గడువులను, లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని సానుకూల దృష్టితో, సరైన స్ఫూర్తితో స్వీకరించాలి. అంగారక గ్రహం తిరోగమనం సవాళ్లు విసురుతుంది. మీ పరిసరాల్లో మార్పు లేకుండా చూసుకోండి.

పెద్ద సవాళ్లను ఎదుర్కోవడం ఒక దశలో చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. జాతకం బాగా లేనప్పుడు సహనంతో, విశ్వాసంతో ముందుకు సాగాల్సి ఉంటుంది.

కన్య

కన్య

మీరు లక్ష్యాలపై దృష్టి పెట్టి మెరుగైన పనితీరును కనబరచాల్సి ఉంటుంది మారాలని మీరు అనుకుంటే గ్రహాలు సహకరించవు. అందువల్ల ప్రస్తుత లక్ష్యానికే కట్టుబడి ఇతర విషయాలపై దృష్టి పెట్టకండి.

ఏప్రిల్ మధ్య భాగం నుంచి అభివృద్ధి కరమైన శక్తులు సమర్థంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. మీ ప్రతిభను కనబరచడానికి ఇది సరైన సమయం. అంటే మీ ప్రతిభ వెలికి రావడానికి గ్రహాలు సహకరిస్తాయి. మీ సృజనాత్మకతను బయటపెట్టడానికి సమయం వ్చే వరకు వేచి చూడండి. అసంతృప్తికి గురి కావద్దు.

చాలా విషయాల్లో సహనం అవసరం. పరిస్థితులు మారే వరకు వేచి చూడండి. గ్రహాలు మీకు అనుకూలంగా మారగానే మిమ్మల్ని ఎవరూ నిరోధించలేరు. కేవలం కొంత సమయం పడుతుంది.

తుల

తుల

మీరు ఈ సంవత్సరం అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. మీ చేతిలో ఉన్న లక్ష్యాలను సాధించడానికి అది అవసరం. ఈ కొత్త సవాల్‌ను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మార్చి మధ్య భాగం మీకు అత్యంత కీలకమైంది. సవాళ్లకు మీరు భయపడకూడదు.

పని చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు ఎక్కువ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. ఒక లక్ష్యాన్ని ఒక సమయంలో చేయడానికి ప్రయత్నించండి. అంగారకుడు మిమ్మల్ని తొందరపెడుతాడు. దాని వల్ల తప్పులు చేసే అవకాశం ఉంటుంది. సమయానికి సంబంధించిన పరిమితిని, హద్దులను గుర్తు పెట్టుకోండి.

అదే సమయంలో మీ పనికి సంబంధించిన అవసరాల విషయంలో రాజీ పడకూడదు. గడువులోగా పనిచేయడమే కాకుండా మీరు చేసే పనిలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.

వృశ్చికం

వృశ్చికం

మంచి ఉద్యోగం కోసం, మంచి వేతనం కోసం ప్రయత్నిస్తారు. సవాళ్ల ద్వారా మాత్రమే అవకాశాలు లభిస్తాయి. ఈ సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మార్చి మధ్య భాగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులను పూర్తి చేయడానికి తొందర పడుతారు. మీ బాస్ మిమ్మల్ని ముందుకు తోస్తూ మీ సమర్థత పెరగడానికి ఉపయోగపడుతాడు.

దాన్ని ఒత్తిడిగా భావించకండి. లో ప్రొఫైల్ అవసరం. మీ బాస్‌తో వాగ్వాదానికి దిగకూడదు. మీరిచ్చే సమాధానాలు కుప్తంగా ఉండాలి. తప్పించుకునే పద్ధతిలో మాట్లాడకూడదు.

ప్రశాంతంగా ఉండాలంటే వాటిని మనసుల్లో పెట్టుకోవడం మంచిది. సమతుల్యత పాటించడం కూడా ముఖ్యం.

ధనుస్సు

ధనుస్సు

మీకు సదవకాశాలు లభిస్తాయి. వృత్తిపరంగా బాగుంటుంది. పని స్థలంలో మీరు సౌకర్యవంతంగా ఉంటారు. మీకు ఓముఖ్యమైన లక్ష్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు అత్యంత సామర్థ్యంతో నెరవేర్చాల్సి ఉంటుంది. ఫలితం సాధించడానికి మీ శక్తియుక్తులన్నింటినీ పెట్టాల్సి ఉంటుంది.

ఆ లక్ష్యం మీ వృత్తిలో ఓ మలుపు అవుతుంది. వృత్తిలో పురోగమించడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. మీకు వృత్తిపరంగా అభివృద్ధి, విజయాన్ని తెచ్చి పెడుతుంది. ఉద్యోగంలో మీరు పదొన్నతి పొందే అవకాశం ఉంది. దాన్ని మీరు మంచి స్ఫూర్తితో స్వీకరించాలి.

మీకు అది ఎంతో సంతృప్తిని ప్రసాదిస్తుంది. ఆనందాన్నిస్తుంది. ఈ మధ్యలో మీకు ఓ సవాల్ ఎదురవుతుంది. అయితే, అది పెద్దగా ఇబ్బంది పెట్టదు.

మకరం

మకరం

మీరు పనిచేసే సంస్థలో తీరిక లేకుండా ఉంటారు. గడువులను, లక్ష్యాలను చేరుకోవడానికి ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ప్రగతిశక్తులు మీకు సంవత్సరమంతా సాయపడుతాయి.

సెప్టెంబర్ నుంచి వృత్తిదారులకు, ఉద్యోగులకు కలిసి వస్తుంది. మీకు ముఖ్యమైన, సంక్లిష్టమైన పనిని అప్పగించే అవకాశం ఉంది. ఇది మీకు మంచి అవకాశం. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. పనిని పూర్తి చేయడానికి మీ శక్తినంతా ఉపయోగించండి. ఇది మీకే కాకుండా మీ చుట్టూ ఉన్నవారికి కడా ఆనందాన్ని ఇస్తుంది. మీ పనికి మీ ఉన్నతాధికారులు కూడా సంతోషిస్తారు.

ఆ లక్ష్యాన్ని మిమ్మల్ని పరీక్షించడానికే ఇస్తారు. ఆ సంక్లిష్టమైన పనిని మీరు పూర్తి చేస్తే మీలో విశ్వాసం పెరగడమే కాకుండా ఇతరుల మెప్పు కూడా పొందుతారు.

కుంభం

కుంభం

పని స్థలాల్లో సౌకర్యంగా ఉంటారు. ఉద్యోగుల అవకాశాలు మెరుగవుతాయి. మీకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పని సంతృప్తి లభిస్తుంది.

జూన్‌లో మంచి ఉద్యోగవకాశాలు, మంచి వేతనంతో లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునేవారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఆ సమయంలో మీకు అన్నీ శుభాలే కలుగుతాయి. అటువంటి కోరిక ఉంటే మీరు ముందుకు సాగవచ్చు.

ఆగస్టు నుంచి మీకు విశాలమైన వేదికలు లభిస్తాయి. మీ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధిస్తారు.

మీనం

మీనం

ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో భద్రతగా ఉంటారు. మార్చి మధ్య వరకు ఉద్యోగులకు అంత మంచి కాలం కాదు. మార్చి మధ్య కాలం నుంచి తీరిక ఉండదు. ఉద్యోగులు కొన్ని కష్టతరమైన లక్ష్యాలు సాధించాల్సి ఉంటుంది. ఫలితం సాధించడానికి నైపుణ్యాలను మెరుగు పరుచుకుని, మీ అనుభవాన్నంతా పెట్టాల్సి ఉంటుంది.

అది అవకాశంగా కనిపించినప్పటికీ కొన్ని సమయాల్లో అది కష్టతరంగా అనిపిస్తుంది. అది తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తుంది. పనులను పూర్తి చేయడానికి రు తొందరపడాల్సి వస్తుంది. కాలంతో పాటు పరుగెత్తాల్సి ఉంటుంది. మీరు పరిస్థితిని సరైన పద్ధతిలో మీకు అనుకూలంగా మలుచుకోవాల్సి ఉంటుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer has given career predictions for the year 2018.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి