మృత్యంజయులైన ఆంధ్రులఅనుభవాలు
న్యూయార్క్‌ః అమెరికా భుగభుగ మంటున్నది. ఆవేదన... ఆక్రోశం.. ప్రతీకారంతో అమెరికా రగిలిపోతున్నది. తీవ్రవాదం సృష్టించిన మారణహోమంలో మృతులు ఎంతమంది అనేవిషయం ఇంకా నిర్దారణ కాలేదు. తీవ్రవాదుల దాడికి కేంద్రబిందువైన వరల్డ్ ట్రేడ్‌సెంటర్ లో కనీసం 10 వేల మంది భారతీయులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.
గాయపడిన వేలాది మందిలో 9 మంది భారతీయులను గుర్తించినట్లు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఉపాధికోసం మాతృభూమిని వదిలి అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులు, ఆంధ్రుల ఆందోళన వర్ణనాతీతం. వారి గురించి ఆంధ్రప్రదేశ్ లోని వారు తల్లిదండ్రులు, భార్యలు, ఆప్తులు పడుతున్న ఆవేదనఅంతా ఇంతా కాదు. అమెరికా మారణహోమం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆంధ్రుల అనుభవాల సమాహారం ఇది....
లోకా నారాయణ రెడ్డి,
చెన్నయ్ అపోలో ఆస్పత్రి వ్యవస్థాపకుడు.
వరల్డ్ ట్రేడ్‌సెంటర్ లో కాన్ఫరెన్స్ రూంలో డాక్టర్ల ను ఇంటర్య్యూ చేస్తున్నా.... భవనం కంపించడంతో ఉలిక్కి పడి, రూం బయటకు వచ్చి చూసే సరికిఅంతా పరుగులు తీస్తున్నారు. ఆందోళనతో 27వ అంతస్తునుంచి పరుగులు తీసుకుంటూ కిందకు చేరుకున్నాం. మేం మాత్రం పాణాలతో బయటపడ్డాం... ఇంకా వందలాది మంది మా ఫ్లోర్ లోనే వున్నారు... వారేమయ్యారో......!!
పెండ్యాల శ్రీనివాస్
కన్సల్టెంట్, సాన్‌విజన్ టెక్నాలజీస్.
న్యూ జెర్సీ నుంచి దాదాపు 500 మంది తెలుగువాళ్ళు ప్రతిరోజు లాగానేరైల్లో న్యూయార్క్ చేరుకున్నారు. న్యూయార్క్ నగరం అగ్నిగుండంగా మారడం చూసి భీతావహులయ్యారు. వరల్డ్ ట్రేడ్‌సెంటర్ లోని మోర్గాన్ స్టాన్లీలో ఎక్కువ మంది తెలుగువాళ్ళు పనిచేస్తున్నారు. వారి గురించే ఆందోళనగా వుంది. మాకన్నా ముందే వరల్డ్ ట్రేడ్‌సెంటర్ కు రోజూ వందమందికి పైగా తెలుగువాళ్ళు వెళతారు. వారు ఈ ప్రమాదంలో చిక్కుకొని వుంటారని ఆందోళన చెందుతున్నాం.
సతీష్ రెడ్డి, సంతోష్ రెడ్డి,
సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, లెమన్ బ్రదర్స్.
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కు చెందిన గంగారెడ్డి కుమారుడు సంతోష్ రెడ్డి, మహబూబ్ నగర్ కు చెందిన సతీష్ రెడ్డిస్నేహితులు. వీరిద్దరూ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పనిచేస్తున్నారు.
ఉదయం 8 గంటలకే ఆఫీసుకు చేరుకున్నాం.... క్షణాల్లో మా ఆఫీసు భవనం గజగజలాడిపోయింది.అరుపులు, ఏడ్పులు, పెడబొబ్బలు... అంతా ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ప్రాణాలుఅరచేత పట్టుకొని 40 అంతస్తు నుంచి పరిగెత్తుకుంటూ నిమిషాల్లో కిందకు వచ్చేశాం. నాలుగు ఫర్లాంగుల దూరం పరిగెత్తి చూసే సరికి మాకు అన్నం పెడుతున్న వరల్డ్ ట్రేడ్‌సెంటర్ మట్టిదిబ్బగా మారింది.
ఇంటెల్లి గ్రూప్ సిబ్బంది క్షేమం
తమ సంస్థలో అమెరికాలో పనిచేస్తున్న 1500 మంది తెలుగువాళ్ళు క్షేమంగా వున్నారు. వారిలో 8 మంది ఉద్యోగులు పేలుడు జరిగిన సమయంలో వరల్డ్ ట్రేడ్‌సెంటర్ లో వున్నారు. ఆ భవనం కూలిపోక ముందే వారు ప్రాణాలతో బయటపడ్డారని ఆ సంస్థ ఛీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ మధు చెప్పారు.
సత్యం సిబ్బంది సురక్షితం
మా సంస్థకు చెందిన 150 మంది న్యూయార్క్, వాషింగ్టన నగరాల్లో పనిచేస్తున్నారు. వారంతా క్షేమంగా వున్నారు. వారి నుంచి పూర్తి సమాచారం కనుక్కున్నాం. వారి గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదు.
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications