12 మంది హైజాకర్ల గుర్తింపు
వాషింగ్టన్: మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన 12 మందికిపైగా హైజాకర్లను అమెరికా అధికారులు గుర్తించారు.వీరికి అంతర్జాతీయ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌తో, ఇతర తీవ్రవాద సంస్థలతో గల సంబంధాలపై సాక్ష్యాధారాలనుసేకరిస్తున్నారు.
కొందరు హైజాకర్లు కెనడాలో ప్రవేశించారనే అనుమానంతో సరిహద్దుల నుంచి అమెరికా అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. వాణిజ్య జెట్‌లైనర్లను నడిపే తీరుపై దాడులకు ముందు కొందరు ఫ్లోరిడాలో శిక్షణ పొందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మస్సాచుసెట్స్‌లో, ఫ్లోరిడాలో సాక్ష్యాధారల కోసం సోదాలు జరిపారు.
సంబంధం లేని స్థానిక వారంట్లకు, వలసకు సంబంధించిన ఆరోపణలపైఅర డజను మందిని మస్సాచుసెట్స్‌లో, ఫ్లోరిడాలోఅరెస్టు చేశారు. వీరికి హైజాకర్లతో గల సంబంధాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే దాడుల ఆరోపణలను వారిపై నమోదు చేయలేదు.
ఫ్లోరిడాలోని ఇద్దరి పేర్ల గురించి అధికారులు ఆరా తీశారు.వీరికి ఏడాది క్రితం తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చిన కుటుంబాన్ని ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రశ్నించింది.
హైజాకింగ్‌లో, దాడుల్లో టెర్రరిస్టు గ్రూప్‌లకు చెందిన చాలా విభాగాలు పాల్గొన్నాయని, హైజాకర్లకు సౌదీఅరేబియా, ఈజిప్టు వంటి దేశాలతో సంబంధాలు వుండవచ్చునని
అధికారులు అంటున్నారు.
ఈ దాడులతో సంబంధం వున్న కొన్ని టెర్రరిస్టుల గ్రూపుల సమాచారం వున్నదని ఎఫ్‌బిఐ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ అన్నారు. ఆ గ్రూపులేవనేవిషయాన్ని, లాడెన్‌తో వాటికి సంబంధాలున్నాయా అనేవిషయాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
హైజాకర్లలో కొందరు కెనడా సరిహద్దులను దాటి బోస్టన్ చేరుకని వుంటారని అధికారులుఅంటున్నారు. మైనెలోన, నోవా స్కోటియాలో అనుమానం వున్న వాహనాలను అధికారులు సోదా చేశారు. బోస్టన్‌విమానాశ్రయం వద్ద మూడో కారు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ కారులోఅరబిక్ భాషలో గల ఫ్లయిట్ మాన్యువల్ దొరికింది.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications