ఐటి రంగం మల్లగుల్లాలు
హైదరాబాద్‌ః అమెరికాలో టెర్రరిస్టులు సృష్టించిన బీభత్సం ప్రభావం ఐటి రంగంపై ఎంతమేరకు వుంటుందనే విషయంపై సరైన మదింపు వేయడానికి ఐటి పరిశ్రమ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఐటిరంగంపై అమెరికా పరిణామాల ప్రభావం స్వల్పకాలిక దృష్ట్యా చాలానే వుంటుందని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు హెచ్‌జె చౌధరి చెప్పారు. మధ్యకాలం, దీర్ఘకాలంలో ఈ ప్రభావంపెద్దగా వుండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మాంద్యంలో వున్న అమెరికా వచ్చే క్రిస్‌మస్‌నాటికి కోలుకునే అవకాశం వున్నదనిఅప్పటినుంచి ఐటి రంగానికి మళ్లీ మంచిరోజులు వస్తాయని ఇప్పటివరకు తామువిశ్వాసంతో వున్నామని ఆయన చెప్పారు.
టెర్రరిస్టుల దాడి వల్ల ఈ మంచిరోజులు మరో ఆరునెలలు వాయిదాపడే అవకాశం కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ ఉత్పాతం నుంచి కోలుకున్న తర్వాత అమెరికాలోని బీమా సంస్థలు,ఎయిర్‌లైన్స్ సంస్థలు, రక్షణ సంస్థలు హైటెక్‌పై మళ్లీ కోట్లాది డాలర్లు ఖర్చుచేయాల్సివుంటుందని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని సుమారు 800 వందల ఐటి కంపెనీల్లో కనీసం ఏడు వందల కంపెనీలు అమెరికా వ్యాపారంపైనే ప్రధానంగా ఆధారపడి వున్నాయి. కొన్ని చిన్న కంపెనీలకు ప్రత్యక్ష్యంగా మరికొన్ని కంపెనీలకు పరోక్షంగా ప్రాజెక్టులు అమెరికానుంచేఅందుతుంటాయి. హైదరాబాద్‌కు చెందిన సత్యం, ఇన్పోటెక్ ఎంటర్‌ప్రైజెస్ వంటి సంస్థలు ఇప్పటికయితే అమెరికాలో వున్న తమ సిబ్బంది క్షేమమని ప్రకటించారు. ఇంటెల్లీ గ్రూప్ సిబ్బందికి సంబంధించి బుధవారం నాడు కొన్ని వార్తలు వచ్చిన తమవారంతా క్షేమంగా వున్నట్టు సంస్థ ప్రకటించింది.విప్రో ఉద్యోగుల్లో నలుగురి జాడమాత్రం తెలియడం లేదనివిప్రో పేర్కొంది.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications