అమెరికాకు పూర్తి సహకారం: పాక్
న్యూయార్క్: తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో తాము పూర్తి సహకారంఅందిస్తామని పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్‌కు హామీ ఇచ్చారు. తీవ్రవాదాన్ని ప్రపంచ వ్యవస్థకు ప్రమాదకారిగా తాము పరిగణిస్తున్నామని ఆయన బుధవారం రాత్రి ఒక ప్రకటనలో చెప్పారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడి నేపథ్యంలో ముషారఫ్ ముఖ్యులతో సమావేశమయ్యారు. తీవ్రవాద చర్యలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు.తీవ్రవాదంపై పోరాడడానికి అంతర్జాతీయ కృషి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉమ్మడి ప్రయోజనం కోసం అన్ని దేశాలూ చేతులు కలపాలని ఆయన అన్నారు.
దాడులకు కారణమైనవారిని పట్టుకోవడానికి సహకరించాలని అమెరికా పాకిస్థాన్‌ను కోరింది. దాడులకు బాధ్యుడని భావిస్తున్న ఒసామాబిన్ లాడెన్ అప్ఘనిస్తాన్‌లో తల దాచుకుంటున్నాడు.అఫ్ఘనిస్తాన్ అతి కొద్ది మిత్రదేశాల్లో పాకిస్థాన్ ఒకటి. దీంతో అమెరికా
పాకిస్థాన్ సహకారాన్ని కోరింది.
ఇదిలా వుంటే, తమ సభ్య దేశమైన అమెరికాపై దాడి జరగడాన్ని నాటో దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పరిణామాలను ఎప్పటికప్పుడు నాటో దేశాలు సమీక్షిస్తున్నాయి. దాడులకు బాధ్యులైనవారిపైసైనిక చర్యే సరైన సమాధానమని నాటో అభిప్రాయపడ్డాయి. వాషింగ్టన్ తీర్మానంలోని అధికరణ ప్రకారం అమెరికాపై జరిగిన దాడి నాటో సభ్య దేశాలన్నింటిపై జరిగినట్లేనని నాటో వ్యాఖ్యానించింది.
అమెరికాలో జరిగిన దాడులతో తమ దేశానికి సంబంధించినవారికి సంబంధం వున్నదని వచ్చిన వార్తను యునైటెడ్‌అరబ్ ఎమిరేట్స్ ఖండించింది. ఐదుగురు అరబ్బులను అమెరికా దర్యాప్తు బృందం అనుమానిస్తున్నట్లు వార్తలు వచ్చినవిషయం తెలిసిందే. సాక్ష్యాలు లేకుండా వార్తలు ప్రచురించినందుకుఅరబ్ ఎమిరేట్స్ వివరణ కోరింది.
సహాయ చర్యల కోసం అమెరికా అధ్యక్షుడు బుష్ 20 బిలియన్ డాలర్లు విడుదల చేశారు. దీనికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.
సంబంధితవార్తలుః
- లాడన్‌పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్‌లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
- భారత్‌దిగ్భ్రాంతి, అత్యవసర సమావేశం
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications