రావులపై బిజెపి సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడినందుకు ఆలంపూర్ శాసనసభ్యుడు డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ సస్పెండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనను బహిరంగ బలపరుస్తూ రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని బిజెపి ఆరోపించింది. పార్టీ ఉపాధ్యక్ష పదవికి పార్లమెంటు సభ్యుడు నరేంద్ర చేసిన రాజీనామాను పార్టీ ఆమోదించింది.
రాష్ట్రాధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నరేంద్ర ఈ నెల 19వ తేదీన తలపెట్టిన తెలంగాణ ఫోరం సదస్సుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సిద్ధిపేట ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బలపరచాలని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నరేంద్ర వ్యతిరేకించడంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
తెలంగాణ అంశంపై ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో రవీంద్రనాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. నరేంద్ర విషయాన్ని జాతీయ అధ్యక్షుడు జనా కృష్ణమూర్తికి నివేదించాలని రాష్ట్ర కార్యవర్గ నిర్ణయించింది. నరేంద్ర పార్లమెంటుసభ్యుడు, బిజెపి పార్లమెంటరీ పార్టీ విఫ్ కావడంతో రాష్ట్ర కార్యవర్గం ఆ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఫోరం సదస్సుకు హాజరయ్యే వారందరిపై చర్య తీసుకోవాలని కార్యవర్గం నిర్ణయం తీసుకుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications