Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిజెపిలో టైగర్‌ ముసలం

నిజామాబాద్‌ః టైగర్‌ నరేంద్ర పెట్టిన చిచ్చు బిజెపిలో పెద్దఎత్తున ముసలం పుట్టిస్తున్నది. నరేంద్రకు మద్దతుగా పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర శాఖ చైర్మన్‌ లోక భూపతిరెడ్డి తమ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

తాను క్రమశిక్షణసంఘం చైర్మన్‌గా వున్నప్పటికీ తనకు తెలియకుండానే నరేంద్ర, రావుల రవీంధ్రనాథ్‌రెడ్డిపై పార్టీ నాయకత్వం ఎలా చర్యతీసుకోగలిగిందని ఆయన ప్రశ్నించారు. తాను కూడా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును సమర్ధిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో జరిగిన సభలో ఆయన ఈవిషయం ప్రకటించారు.

మరోవైపు తాము పార్టీలో వుంటూనే ప్రత్యేక తెలంగాణాకోసం పోరాడుతామని నరేంద్ర నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. బిజెపి నిజామాబాద్‌ జిల్లా శాఖ ఈ సభను ఏర్పాటు చేసింది. తెలంగాణాలో బిజెపికి చెందిన నాయకులు, కార్యకర్తలంతా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా వున్నారని నరేంద్ర చెప్పారు. తెలుగుదేశం పార్టీకి భయపడి బిజెపి అగ్రనాయకత్వం తెలంగాణావిషయంలో మాటతప్పుతున్నదని ఆయన విమర్శించారు. ఇదిలా వుండగా వివిధ తెలంగాణా జిల్లాల్లో నరేంద్రకు బిజెపి కార్యకర్తలు, స్థానిక నేతలనుంచి గట్టి మద్దతు లభిస్తున్నట్టుగా తెలిసింది.

పార్టీపై బిజెపి నరేంద్ర నిప్పులు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+