• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాలుగైదేళ్లకుకోచ్‌గా మారుతా: గంగూలీ

By Staff
|

కోల్‌కత్తా:మరో నాలుగైదేళ్లు ఆడి కోచ్‌గామారిపోతానని భారత క్రికెట్‌ జట్టుకెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ అన్నారు.రాహుల్‌ ద్రావిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌,బ్రియాన్‌ లారా, స్టీవ్‌ వా తన అభిమానక్రికెటర్లని ఆయన చెప్పారు.

తానుక్రికెట్‌ పర్యటనలకు వెళ్లినప్పుడుకాళీమాత చిత్రాన్ని, భార్య, కూతురుఫొటోలను హోటల్‌ గదిలోని బల్లపైపెట్టుకుంటానని ఆయన ఒక ఇంటర్వ్యూలోఅన్నారు. మీ అభిమాన క్రికెటర్లలోవరుసలో మొదట ద్రావిడ్‌ పేరు ఎందుకుచెప్పారని అడిగితే ద్రావిడ్‌ మంచిక్రీడాకారుడే కాకుండా మంచి మనిషి అనిజవాబిచ్చారు.తానుఇప్పటికిప్పుడు రిటైర్‌మెంట్‌ గురించిఆలోచించడం లేదని, ఇంకో నాలుగైదేళ్లుఆడి భారత క్రికెట్‌ను అత్యున్నతస్థాయికి తీసికెళ్లాలని అనుకుంటున్నాననిఆయన అన్నారు. భారత క్రికెట్‌ముందుకు సాగాలని తానుకోరుకుంటున్నట్లు, భారత్‌కు మరిన్నివిజయాలను అందించేందుకు కృషిచేయనున్నట్లు ఆయన తెలిపారు.రిటైర్‌ అయిన తర్వాత కూడాక్రికెట్‌తో అనుబంధంతెంచుకోబోనని, కోచ్‌గాకొనసాగుతానని ఆయనచెప్పారు.తానుసక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ కావడానికిజట్టును గెలిపించగలిగే వీరేందర్‌సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్బజన్‌సింగ్‌ వంటి పలువురు యువక్రీడాకారులుండడం కారణమనిఆయన అన్నారు. మంచి జట్టు ఉండడంతన అదృష్టమని, సెహ్వాగ్‌, జహీర్‌,ద్రావిడ్‌ వంటి జట్టును గెలిపించగలిగేసత్తా గల ఆటగాళ్లున్నారని ఆయనఅన్నారు.లక్ష్మణ్‌మంచి ఆటగాడిగా ముందుకు వచ్చాడని,యువరాజ్‌ సింగ్‌, హర్బజన్‌వంటివారున్నారని, అనిల్‌ కుంబ్లే ఈవిధమైన బౌలింగ్‌ చేయడంతానెప్పుడూ చూడలేదని ఆయనఅన్నారు. క్రీడాకారుల పాజిటివ్‌ మైండ్‌సెట్‌ తమకు విజయాలను అందిస్తోందనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X