ఎన్టీఆర్ ఫొటో లేకుండా గెలుస్తారా?: చిరు
చిత్తూరు: ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫొటో లేకుండా ప్రచారం చేసుకోగలరా అని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి..బాబు ని సూటిగా ప్రశ్నించారు.ఎన్టీఆర్ విధానాలకు పూర్తిగా నీళ్లొదిలిన చంద్రబాబు ఆ పనిచేయలేరన్నారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్న వ్యక్తి నేడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన చిరంజీవి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలపై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. విమర్శలతో మరింత చెలరేగిపోయారు. ప్రజారాజ్యం పార్టీపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీదే దాడిని ఎక్కు పెట్టారు.
పూర్తి స్ధాయిలో ప్రజలకు సేవచేయాడానికే ప్రజారాజ్యం ఆవిర్భవించిందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. చిత్తూరులో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేద ప్రజల తరఫున ప్రజారాజ్యం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించాలనే ఉద్దేశంతోనే మహాకూటమి ఏర్పడిందని ఆయన విమర్శించారు. భావ సారూప్య రాజకీయపక్షాలతో ఇప్పటికీ పొత్తుకు సిద్దమేని ఆయన తెలిపారు.
అలాగే మొగల్తూరుకు ఏమి చేశారని ప్రశ్నిస్తున్న వైఎస్ తన సొంతగ్రామమైన బలపనూరుకు ఏమి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. పీఆర్పీకి ఎటువంటి సిద్ధాంతాలు లేవని విపక్షాలు చేస్తున్న దాడిని తిప్పికొట్టారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు లాగా వెన్నుపోట్లు, ఫ్యాక్షనిజం, అవినీతి తమ సిద్ధాంతాలు కాదని, ప్రజల బాగోగులే ఏకైక సిద్ధాంతమని చిరంజీవి స్పష్టం చేశారు.
అంతేగాక తాను సినీ రంగంలో కష్టపడి పైకొచ్చానే తప్ప సునాయాసంగా ఎదగలేదన్నారు. ప్రజలు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి తన సినిమాలు చూ సి ఆదరించారని, అందులో తనకూ ఓ రూపాయి దక్కడం వల్లే ఈ స్థాయికి ఎదిగానన్నారు. తననింతటి వాణ్ణి చేసిన ప్రజల పట్ల కృతజ్ఞత, బాధ్యత వుండడం వల్లే వారికోసం ఏదైనా చేయాలనే తపనతోనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించానన్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications