తెలంగాణ పర్యటనకు సోనియా రెడీ
హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో పర్యటనకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) యుపిఎ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తెలంగాణలో పర్యటించనలేదు. ఒక్కసారి సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను ఖరారు చేసుకుని కూడా రద్దు చేసుకున్నారు. తెలంగాణపై శాసన సభ, శాసనమండలి సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటించిన తర్వాత ఆమె తెలంగాణలో పర్యటించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
సోనియా గాంధీ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఆమె హైదరాబాదు, విజయవాడలను సందర్శిస్తారు. అలాగే తెలంగాణలోని వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా పర్యటిస్తారు. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, మెదక్ జిల్లాలోని కంది ప్రాంతాలకు ఆమె వస్తున్నారు. తెలంగాణపై వైయస్ ప్రకటనకు గల ప్రతిస్పందనను ఆమె ఈ సందర్భంగా అంచనా వేయవచ్చు.












Click it and Unblock the Notifications
