లోకసభ సభ్యుడే ప్రధాని: కారత్
న్యూఢిల్లీ: ఎన్నికల తర్వాత లోకసభ సభ్యుడినే ప్రధాని అభ్యర్థిగా బలపరుస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ చెప్పారు. ప్రస్తుత ప్రధాని, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడు కావడాన్ని ఈ సందర్భంగా గమనించాల్సి ఉంటుంది. తాను ప్రధాని పదవి రేసులో లేనని కారత్ ఆదివారం ఒక టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఎన్నికల తర్వాత ప్రధాని పదవికి సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. తృతీయ ఫ్రంట్ అధికారానికి వచ్చే అవకాశం ఉంటే కాంగ్రెసు తమను బలపరచాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఎన్నికలు తర్వాతనే తృతీయ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థిని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. వామపక్షాల తరఫున తాను ప్రధాని పదవి అభ్యర్థిని కానని ఆయన చెప్పారు. ఇతర పార్టీల సూచనల మేరకు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రధాని పదవి అభ్యర్థిని నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. జయలలిత వర్సెస్ మాయావతి అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. జయలలిత ఇప్పటి వరకు తాను ప్రధాని పదవిని ఆశిస్తున్నట్లు చెప్పలేదని ఆయన గుర్తు చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications