గాంధీ పేరుతో గుర్తించవద్దు: వరుణ్
ఖాగా (ఉత్తరప్రదేశ్): తనను తన పేరులోని గాంధీ పదంతో గుర్తించవద్దని, తన సేవలతో గుర్తించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఫిలిభిత్ అభ్యర్థి వరుణ్ గాంధీ అన్నారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చినందుకు ఎలాంటి భావనకు గురవుతున్నారని తనను అడుగుతుంటారని, తనను తన పేరుతో గుర్తించవద్దని, తాను చేసే పనితో గుర్తించాలని ఆయన అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఆదివారం తొలిసారి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.
కులాలకు అతీతంగా ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కులాల ప్రాతిపదికపై ఓటు వేస్తారో, దేశభక్తి విలువలకు ఓటేస్తారో ఉత్తరప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. జైల్లో తనను ఒంటరిగా ఉంచారని ఆయన చెప్పారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications