కాలిఫోర్నియా: సింఫోనీ ఇన్ కార్పోరేషన్ ఎంటర్ టైన్ ఇండస్ట్రీ సహకారంతో ఈ నెల 31వ తేదీన నూతన సంవత్సర ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం అమెరికాలోని బే ఏరియా, సిఎలో జరుగుతుంది. శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్ లో ఇది జరుగుతుంది. సూపర్ స్టార్స్, ఇతర సెలిబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బే ఏరియా టాప్ డిజెలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. నటి కాజల్ అగర్వాల్ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటుంది. డేవిన్, అతీష్ వంటి డిజెలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సింఫోనీ టైగర్ ఫెస్ట్ 2010 టీజర్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నవంబర్ 26వ తేదీన ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని మిల్పాటాటస్ సీరా థియేటర్స్ లో ఈ ఆవిష్కరణ జరిగింది. స్థానిక ప్రతిభను చాటుకోవడానికి ఈ కార్యక్రమం పనికి వస్తుందని, ఇది ఒక అవకాశంగా ఉపయోగపడుతుందని సిఫోని సిఇవో సాయి సైచుక్ మానుప్రగడ చెప్పారు, నృత్యాలు, సంగీత వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయని ఆయన చెప్పారు. తాము 35 దేశాల కళాకారులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. తాము నిరుడు జులైలో సింఫోనీ రేడియాను ప్రారంభించినట్లు తెలిపారు.