ముంబై: భారత స్టాక్ ఎక్సేంజ్ గురువారం లాభాలతో ప్రారంభం అయింది. ఆశావహ దృక్పధంలో ప్రారంభం అయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభం అయిన పది నిమిషాల స్వల్ప వ్యవధిలోనే 85 పాయింట్ల లాభాన్ని అందుకుంది. 0.5 శాతం లేదా 85.89 పాయింట్ల లాభంతో 17, 255.8 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కూడా లాభాల్లోనే ప్రారంభం అయింది. బుధవారం 5,123.25 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ గురువారం 0.44 శాతం లాభపడి 5, 145.85 వద్ద ట్రేడింగ్ జరుపుతోంది.