నిమ్స్ లో కెసీఆర్ కు డిఎస్, సబిత పరామర్శ

నిరాహారదీక్షలో ఉన్న తెరాస అధినేత చంద్రశేఖరరావును రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని నిమ్స్ డైరెక్టర్ ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు హోంమంత్రి రాకను నిరసిస్తూ తెరాస కార్యకర్తలు హోంమంత్రి గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రితో పాటు తెలంగాణకు చెందిన మంత్రులు కేసీఆర్‌ను పరామర్శించేందుకు నిమ్స్‌కు రావడంతో పోలీసులు గట్టిభద్రత కల్పించారు.