హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ తెలంగాణ లాంటి సున్నిత సమస్యపై అయోమయానికి గురిచేసే విధంగా వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆమోస్ మండిపడ్డారు. రాష్ట్రానికి ఇన్‌ఛార్జిగా మొయిలీ వుండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా అయోమయ ప్రకటనలు చేయడం తగదని ఆయనన్నారు.
ఇలా ఉండగా నిరాహారదీక్షలో ఉన్న కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయనకు సపోర్ట్ థెరపీ ఇస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సత్యనారాయణ వెల్లడించారు. లివర్ పరీక్షలు సాధారణంగానే ఉన్నట్టుగా నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆహారం తీసుకోనందువల్ల ఆయన నీరసంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.