సమైక్యాంధ్రపై చిరంజీవి నిర్ణయం వాయిదా

సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు రావడంతో తెలంగాణ నాయకులు చిరంజీవితో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపితే తెలంగాణలో పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని, విశ్వసనీయతను కోల్పోతారని వారు చిరంజీవితో చెప్పారు. ప్రజల నుంచి, సీమాంధ్ర నేతల నుంచి తనపై తీవ్ర ఒత్తిడి ఉందని చిరంజీవి వారితో చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం మార్చుకుంటే తప్పేమిటని సీమాంధ్ర నేతలు ప్రశ్నించారు. రెండు ప్రాంతాల నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో చిరంజీవి తన నిర్ణయాన్ని 15 రోజులు పాటు వాయిదా వేసుకున్నారు. చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు పలికి తిరుపతిలో దీక్ష చేస్తారని వచ్చిన వార్తలను పార్టీ ప్రతినిధి శ్రవణ్ ఖండించారు.












Click it and Unblock the Notifications
