తెలంగాణ జెఎసిలో టిడిపి చేరాలి: జానా

తాము తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వలేదని, ఈ నెల 29వ తేదీ తర్వాత నిరవధిక బంద్ పాటిస్తామని కూడా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తాము తిరిగి పిలుపు ఇచ్చేవరకు ఏ విధమైన బంద్ లు పాటించకూడదని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడకూడదని ఆయన కోరారు. అస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కూడా ఆయన కోరారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, అది మంచిది కాదని, నాయకులను అవమానించే పద్ధతిలో వ్యవహరించకూడదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెసు అధిష్టానం వెనక్కి పోలేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనలో స్పష్టత లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో స్పష్టత కావాలని, ప్రక్రియ ప్రారంభంలో జాప్యం జరగకూడదని ప్రజలు కోరుతున్నారని, దాని కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని, తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు తాము కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్రాన్ని మెప్పించి, ఒప్పించే బాధ్యత తమదేనని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications