వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ స్కామ్: గవర్నర్ తివారీ రాజీనామా?

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
హైదరాబాద్: సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ రాజభవన్ లోని సెక్స్ కుంభకోణాన్ని బయటపెట్టింది. కోర్టు ఇంజక్షన్ ఇవ్వడంతో ఆ చానెల్ ప్రసారాన్ని ఆపేసింది. రాజభవన్ లోని రాసలీల దృశ్యాలను ఆ టీవి చానెల్ గంటపాటు ప్రసారం చేసింది. ఆ స్కామ్ వార్తను రాజభవన్ వర్గాలు ఖండించాయి. అయినప్పటికీ తివారీకి పదవీ గండం తప్పలేదు. తివారీ వ్యవహారంపై రాష్ట్రంలోని రాజకీయ పక్షాల నుంచి, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ తాజా పరిణామం నేపథ్యంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ హైదరాబాద్ పర్యటన కూడా రద్దయినట్లు సమాచారం. శీతాకాలం విడిది కోసం ఆమె హైదరాబాద్ రావాల్సి ఉండింది.

గవర్నర్ ఎన్ డి తివారీ రాసలీలలను ఆంధ్రజ్యోతి చానల్ శుక్రవారం ఉదయం బయటపెట్టింది. సెక్స్ వర్కర్లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించుకుని వారిని రాజ్ భవన్ లో తోటమాలీలుగా పెట్టుకుని వారితో 85 ఏళ్ల తివారీ రాసలీలలు సాగిస్తున్నట్టు సీక్రెట్ కెమెరాల ద్వారా ఈ చానల్ బయటపెట్టింది. నగ్నంగా గవర్నర్ గారు ఆ అమ్మాయిలను కూడా నగ్నంగా మార్చి మసాజ్, ఇతర పనులు చేయించుకుంటున్నట్టు ఈ క్లిప్స్ బయటపెట్టాయి. ఈ వార్త ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రాంతాల మధ్య పోరాటాల ద్వారా దేశమంతటా వార్తల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గవర్నర్ రాసలీలల విషయంలోనూ ముందు ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన తరుణంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత గల గవర్నర్ ఇలా వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది.

గవర్నర్ తివారీ ద్వారా తనకో కొడుకు పుట్టాడంటూ కాంగ్రెసు నాయకుడు నట్వర్ సింగ్ కూతురు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కొన్ని స్టార్ హోటళ్ళలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని బహిరంగంగా మందుకొడుతున్న వార్తలు కూడా బయటికి వచ్చాయి. కేంద్రానికి ఈ విషయంలో స్పష్టమైన సమాచారం అందిందని, ఎటూ ఆయనను మార్చి దిగ్విజయ్ సింగ్ ను కానీ ఉమన్ చాందీని కానీ నియమిస్తారని వార్తలు ఇంతకు ముందే వచ్చాయి. రాజ్ భవన్ ను అపవిత్రం చేసిన తివారీపై కొన్ని గంటల్లోనే వేటుపడే అవకాశముందని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X