స్వామి రాసలీలలు అబద్ధం: భక్తులు

తమిళ చానల్స్, కొన్ని ఆంగ్ల పత్రికలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. నిత్యానందస్వామి హరిద్వార్‌లో జరుగుతున్న కుంబమేళలో పాల్గొన్నందువల్ల అందుబాటులో లేరని, త్వరలో ఆయనే అన్ని వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో సంచలనం కలిగించిన ఈ రాసలీలలపై వివరణ ఇవ్వకుండా కుంభమేళలో పాల్గొనడం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా..అక్కడ జరుగుతున్న కుంభమేళలో లక్షల మంది సాధువులు, సన్యాసులు వచ్చారని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామిజీ అన్ని వివరాలను మీడియా ద్వారా భక్తులకు, ప్రజలకు నిజాలు వెల్లడిస్తారని సచ్చిదానంద అన్నారు. క్లిప్పింగుల్లో వున్నది నిత్యానందస్వామి కాదా..సినీనటి రంజిత కాదా..అని విలేకరులు ప్రశ్నించగా..ఆ విషయం తనకు తెలియదని దాటవేశారు.
ఏడు నెలల క్రితం నుంచి సినీ నటి రంజిత ఆశ్రమానికి వచ్చి ధ్యానం చేస్తోందని మాత్రం సమాధానమిచ్చారు. నిత్యానందకు అత్యంత సన్నిహితుడైన డ్రైవర్ లెనిన్ కరూప్పన్ చెప్పిన విషయాలు నిజం కాదా..అతను కావాలని చెబుతున్నాడా..లెనిన్ పై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా 'నోకామెంట్..అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని దాట వేశారు. లెనిన్‌ను ఆదివారం పోలీసులు బెంగళూరు తీసుకువచ్చారు కదా అని అడగగా తనకు తెలియదని చెప్పారు. ఈ ఆశ్రమంలో ఉన్నతమైన కుటుంబాలకు చెందినవారు, వారి పిల్లలు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారని, వారి మనోభావాలను, భక్తులను దృష్టిలో పెట్టుకుని తప్పుడు ప్రచారం చేయరాదని మీడియాకు మనవి చేశారు. రాసలీలలు క్లిప్పింగుల గురించి ప్రశ్నించగా కొందరు స్వామిజీ ఎదుగుదల చూసి ఓర్చుకోలేక ఈ విధంగా చేశారని, రెండు, మూడు రోజుల్లో స్వామిజీ అన్ని వివరాలు వెల్లడిస్తారని అన్నారు. రెండు రోజుల క్రితం నిత్యానందస్వామి ఒక వెబ్ సైట్ లో వివరణ ఇచ్చారని గుర్తు చేశారు.