వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ విద్యార్ధి హత్య సంచలనం

By Santaram
|
Google Oneindia TeluguNews

Narasaraopet
నరసరావుపేట: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదివిన ఓ విద్యార్థి దారుణ హత్యకు గురైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ విద్యార్థిని తోటి మిత్రుడు అతని సోదరుడు మరికొందరు కలిసి నమ్మకంగా పిలుచుకెళ్లి హతమార్చినట్లు తెలుస్తోంది. పట్టణ పొలిమేరల్లో ఉన్న శ్రీకృష్ణచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్న కర్రి మధురమూర్తి కోటప్పకొండ సమీపంలో సోమవారం శవమై తేలాడు. మధురమూర్తి ఇంటర్మీడియట్‌ చివరి పరీక్ష ఈ నెల 22న రాశాడు. ఆ తరువాత స్వస్థలం పెదరెడ్డిపాలేనికి చేరలేదు. అయినా విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ నెల 26న మధురమూర్తి ఇంటికి కొన్ని ఫోన్లు వచ్చాయి. మధురమూర్తిని కిడ్నాప్‌ చేశామని, డబ్బులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

దీంతో తన తమ్ముడి కుమారుడు పరీక్షలు రాసి ఇంతవరకు ఇంటికి చేరలేదని మధురమూర్తి పెదనాన్న కర్రి బ్రహ్మానందరావు ఈ నెల 27న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్‌ ఎస్‌ఐ సుబ్బారావు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి అదృశ్యంపై రూరల్‌ పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు జరిపారు. కోటప్పకొండ వెనుకవైపు బండల కింద ఓ యువకుడి శవం ఉందని అందిన సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా మధురమూర్తి శవం గుర్తుపట్టలేని విధంగా కనిపించింది. మధురమూర్తి హత్యకు గురవడం పోలీసులను కూడా నిర్ఘాంతపరిచింది.

చివరి పరీక్ష రాసిన రోజే మధురమూర్తి తన స్నేహితుడు బలరామ్‌ ను 200 రూపాయలు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో తనవద్దలేవని, సోదరుడి వద్ద ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు. అప్పటికే మధురమూర్తి బలరామ్‌ కు 400 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన బలరామ్‌ సోదరులు ఇవ్వాల్సిన 400 రూపాయలు ఇవ్వలేదు, మళ్లీ 200 రూపాయల కోసం వచ్చావు.. ఎలా తీరుస్తావని ప్రశ్నించాడు. దానికి మధురమూర్తి తాను తన తండ్రికి ఒక్కడే కొడుకునని, 80ఎకరాల పొలం, బంగారం, ఇంకా ఆస్తి ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమాధానం విన్న తరువాత అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ మరికొందరితో కలిసి మధురమూర్తిని గొంతునులిమి హతమార్చినట్లుగా భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X