హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యకు కలిసొచ్చిన తుఫాను

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: లైలా తుఫాను ముఖ్యమంత్రి కె. రోశయ్యకు కలిసి వచ్చినట్లే ఉంది. ఆయన పాలనా వ్యవహారాలపై, సంక్షేమ పథకాల కోతపై నెలకొన్న మబ్బులు తాత్కాలికంగానైనా పక్కకు తొలగాయి. పైగా అదనపు బలం చేకూరింది. తుఫాను తాకిడి ప్రమాదాన్ని పసిగట్టిన తర్వాత నష్ట నివారణకు చేపట్టిన ముందస్తు చర్యలు ఆయనకు బలాన్నిస్తున్నాయి. ప్రతిపక్షాల నాయకులు కూడా రోశయ్య తీసుకున్న చర్యలను ప్రశంసిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇక రోశయ్య మంచి మార్కులు సాధిస్తారని ప్రశంసించారు. అలాగే, రోశయ్య ప్రభుత్వం తుఫాను తాకిడిని తట్టుకోవడానికి తీసుకున్న ముందస్తు చర్యలను భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు కొనియాడారు.

రోశయ్య ప్రభుత్వంపై కరుడు గట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఏ విధమైన విమర్సలు చేయలేని పరిస్థితి ఉంది. తుఫాను తాకిడి ముప్పు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం చాలా ముందు జాగ్రత్త చర్యతో వ్యవహరించింది. తుఫాను తాకిడి హెచ్చరికలు వచ్చిన వెంటనే రోశయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా కదిలించారు. మంత్రులు కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. మంత్రులు వెంటనే జిల్లాలకు తరలి వెళ్లారు. ఇంతకు ముందు వరదలు ముంచెత్తినప్పుడు ప్రభుత్వంపై వచ్చిన తీవ్రమైన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రోశయ్య వేగంగా కదిలి చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కోత పెడుతుందనే విమర్సల నుంచి కూడా ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది. తుఫాను తాకిడి వల్ల ప్రతిపక్షాలు, స్వపక్షం వారు రోశయ్య ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన అస్త్రాలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X