హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పండు హత్య కేసులో నిందితుడు మహేందర్ రెడ్డి సరెండర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chalasani Venkateswara Rao
హైదరాబాద్: తెలుగుదేశం నాయకుడు పండు హత్య కేసులో నిందితుడు మహేందర్ రెడ్డి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పండు హత్య కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. పండు హత్యలో మహేందర్ రెడ్డి మాత్రమే కాకుండా మరో ఇద్దరు కూడా పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. హంతకులు తమ కారును స్పప్నిక్ అపార్టుమెంటు వద్దనే వదిలిపోయారు. పండు హత్యపై తెలుగుదేశం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పలువురు తెలుగుదేశం నాయకులు సంఘటనా స్థలానికి వచ్చారు. పండు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

పండు హత్యపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. పండు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామం వెంట్రప్రగడకు తరలిస్తారు. పండు హత్యకు నిరసనగా మంగళవారం కృష్ణా జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే విజయవాడలో దుకాణాలు మూసివేశారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X