మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రోశయ్య నో కామెంట్
State
oi-Srinivas G
By Srinivas
|
తిరుపతి: మంత్రివర్గ విస్తరణపై మాట్లాడడానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య నిరాకరించారు. ఆయన శుక్రవారం ఉదయం తిరుపతి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వడానికి నిరాకరించారు. మంత్రివర్గ విస్తరణ కోసమే ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అదేమీ లేకుండా రోశయ్య ఢిల్లీ పర్యటన ముగిసింది. దీంతో మీడియా ప్రతినిధులు మంత్రివర్గ విస్తరణపై పదే పదే ప్రశ్నలు వేశారు.
కాగా, మైక్రో ఫైనాన్స్ సంస్థల ఆగడాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్డినెన్స్ ను గవర్నర్ నరసింహన్ కు పంపామని, ఈ సాయంత్రంలోగా అది జారీ కావచ్చునని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిమితులకు లోబడే ఆర్డినెన్స్ ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. వడ్డీరేట్ల పరిమితిపై రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.