హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ వైద్యాశాల భవనంపైకి ఎక్కిన విద్యార్థులు: పరిస్థితి ఉద్రిక్తం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మెరిట్ ప్రకారమే డిఎస్సీ-2008 ఉద్యోగాలను భర్తీ చేయాలని బీఇడి విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గాంధీ అసుపత్రిలో ఉద్రిక్తతకు చేరుకుంది. ఇద్దరు బిఇడి విద్యార్థులు గాంధీ వైద్యశాల భవనంపైకి ఎక్కి మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమే అని అన్నారు. 70-30 శాతం ఇస్తానని ప్రభుత్వం చెబుతోందని దానిని తాము ఆమోదించే పరిస్థితి లేదని, మెరిట్ ప్రకారం ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. పోలీసులు అప్రమత్తమై వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.

మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఇందిరా పార్కు వద్ద 5గురు విద్యార్థులు ఆమరణ నిరాదీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. వరంగల్ కు చెందిన జయప్రకాశ్, మెదక్ కు చెందిన శ్రీనివాస్, ఖమ్మంకు చెందిన రహీం, తూర్పు గోదావరికి చెందిన వెలుగుజ్యోతి, శ్రీకాకుళంకు చెందిన వాసుదేవరావు నిరాహార దీక్షకు పూనుకున్నారు. వారి అరోగ్య పరిస్థితి క్షీణించటంతో పోలీసులు గురువారం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో ఇద్దరు విద్యార్థులు అరోగ్యం బాగా ఉన్నప్పటికీ మరో ముగ్గురి అరోగ్యం క్షీణించింది.

వైద్యశాలలో ఉన్న ముగ్గురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వారికి ఏమైనా జరిగితే తమ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని బీఇడి విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. వీరికి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X