వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్త చరిత్ర -2 పరిటాల రవికి ఫేవర్ గా ఉంది: మద్దెలచెర్వు సూరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Maddelacheruvu Suri
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర -2 సినిమాపై పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూరి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రక్తచరిత్రలో మద్దెలచెర్వు సూరి పాత్రను సూర్య, పరిటాల రవి పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించిన విషయం తెలిసిందే. రక్తచరిత్ర -2 సినిమాపై అభ్యంతరాలు తెలియజేయడానికి రామ్ గోపాల్ వర్మ ఫోన్ లో దొరకడం లేదని, అందుకే మీడియా ద్వారా తన అభ్యంతరాలను తెలియజేస్తున్నానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

టీవీ బాంబు కేసులో ప్రధాన నిందితుడు పరిటాల రవి అని, ఆ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ సినిమాలో చూపించలేదని ఆయన అన్నారు. సినిమాలో నిజాలను చూపించకుండా పరిటాల రవికి ఫేవర్ గా రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారని ఆయన విమర్శించారు. తన అభ్యంతరాలను తెలపడానికి వర్మ ఫోన్లో దొరకడం లేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X